Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

year ender 2024: ఈ ఏడాది హైదరాబాద్ ప్రశాంతం కానీ, 297 కోట్లు పోగొట్టుకున్నారు!

హైదరాబాద్ నగరం 2024వ సంవత్సరంలో చాలా ప్రశాంతంగా ఉందని సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికపై సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో అన్ని పండగలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. హోంగార్డు నుంచి సీపీ వరకూ అందరూ కష్టపడ్డారని.. అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేశామని సీపీ తెలిపారు. అయితే, క్రైమ్ రేట్ ఈ సంవత్సరం కొంత పెరిగిందని వెల్లడించారు. డయల్ 100కి వస్తున్న ఫిర్యాదులపై స్పందన పెరిగిందన్నారు. క్రైమ్ జరిగినప్పుడు ఘటనా స్థలానికి ఏడు నిమిషాల కన్నా తక్కువ సమాయానికే చేరుకుంటున్నామని తెలిపారు. 129 పెట్రోల్ కార్స్, 210 బ్లూ కోల్డ్ వాహనాలు, ఇంటర్ సెప్టర్ వాహనాలను కూడా విజిబుల్ పోలీసింగ్ భాగస్వామ్యం చేశామని వెల్లడించారు. రాత్రిపూట గస్తీకూడా పెంచామన్నారు.

year ender 2024 CV Anand on the 2024 Hyderabad Commissionerate Annual Crime Report

సౌండ్ పొల్యూషన్ పై తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు వస్తోందని సీపీ తెలిపారు. డీజేల సౌండ్‌పై అప్పుడప్పుడు ఇంకా కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 45 శాతం ఎఫ్ఐఆర్‌లు పెరిగినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పెరిగిన ఫిర్యాదుల్లో చిన్న చిన్న చోరీలు, యాక్సిడెంట్ కేసులున్నాయని చెప్పారు. గతంలో చిన్న ఫిర్యాదులకు ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోయేదని.. ఇప్పుడు ప్రతి చిన్న నేరానికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేసుల సంఖ్య పెరిగిందని వివరించారు.

కిడ్నీప్ కేసుల్లో 85 శాతం పెరుగుదల నమోదైందని, మొబైల్ చోరీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. సైబర్ నేరాల వల్ల డబ్బులు పోగొట్టుకున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోందని సీపీ తెలిపారు. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా.. ప్రజలు మోసపోతూనే ఉన్నారని సీపీ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ అనగానే భయపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పారు.

పెట్టుబడుల విషయంలోనూ మోసపోతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉందని సీపీ తెలిపారు. గత ఏడాది కంటే 91 శాతం ఎక్కువ డబ్బు పోగొట్టుకున్నారని చెప్పారు. కరెంట్ ఖాతాల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని సీపీ తెలిపారు. ఎటువంటి విచారణ లేకుండానే కొందరికి బ్యాంక్ సిబ్బంది కరెంట్ ఖాతాలు ఇస్తున్నారని చెప్పారు. అంతేగాక, సైబర్ నేరగాళ్లకు కొందరు బ్యాంక్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

ఈ ఏడాది రూ. 297 కోట్లు సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారని.. రూ. 42 కోట్లు సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేశామని సీపీ తెలిపారు. సైబర్ నేరాల్లో 30 శాతం కేసులు డిటెక్షన్ పెరుగుదల ఉందన్నారు. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేశామని సీపీ వివరించారు. నగరంలో ఆపరేషన్ రోప్‌ను తీవ్రం చేశామన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ కట్టడిలో టాస్క్ ఫోర్స్ ముందుందన్నారు. రౌడీలపై టాస్క్ ఫోర్స్ ఉక్కు పాదం మోపుతోందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+