వైద్యుల నిర్లక్ష్యం: పంటి నొప్పితో వెళితే.. ప్రాణం తీశారు!

హైదరాబాద్: పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ దంత వైద్యశాలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్​ 37లో ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌​లోకి లక్ష్మీ నారాయణ (28) అనే యువకుడు పంటి సమస్యతో దంత చికిత్స కోసం వెళ్లాడు. అయితే, కాసేపటికి పరిస్థితి విషమంగా మారడంతో ఆ యువకుడ్ని దగ్గరల్లో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతడు మృతి చెందాడని తెలిపారు.

Young Man Died in FMS International Dental Clinic Hyderabad, due to medical staff negligence

కాగా, లక్ష్మీ నారాయణ మృతిపై అతని కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంటి వైద్యం కోసం వచ్చిన లక్ష్మీ నారాయణకు డాక్టర్లు మత్తు మందు ఎక్కువగా ఇచ్చారని ఆరోపించారు. అనంతరం యువకడు స్పృహ కోల్పోయాడని, దీంతో ఆ యువకుడ్ని వెంటనే అపోలో ఆస్పత్రి నుంచి అపోలోకి తరలించారని చెప్పారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మార్గమధ్యలోనే లక్ష్మీనారాయణ చనిపోయినట్లు నిర్ధారించారని తెలిపారు.

పంటి నొప్పితో వచ్చిన లక్ష్మీనారాయణ.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనస్తేషియా(Anesthesia) డోస్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మరణానికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు ఎలా చనిపోయాడు? డాక్టర్ల నిర్లక్ష్యమా? అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+