తననే పెళ్లి చేసుకోవాలంటూ.: టీవీ యాంకర్‌ను కిడ్నాప్ చేసిన యువతి, అరెస్ట్
హైదరాబాద్: ఓ టీవీ యాంకర్‌ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేయడంలో హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. అతడ్ని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనే కోరికతో అతడ్ని కిడ్నాప్ చేసింది. ఆ యువతి బారి నుంచి బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలైన త్రిషను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన రాత్రి ఐదుగురు వ్యక్తులు టీవీ యాంకర్ ప్రణవ్‌ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్‌ను బెదిరింపులకు గురిచేసింది. అయితే, ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతే కిడ్నాప్ చేయించినట్లు గుర్తించారు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న త్రిష.. ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రణవ్ ఫొటోలు చూసి ఇష్టపడింది. ఎలాగైన అతడ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే యాంకర్ ప్రణవ్‌ను కిడ్నాప్ చేయించింది.
తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి చేసింది. అయితే, ప్రణవ్ ఆమె బారినుంచి తప్పించుని పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలు త్రిషను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ కేసులో ట్విస్ట్ ఏమిటంటే.. మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రణవ్ ఫొటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు త్రిషతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications