పెద్దలు అంగీకరించలేదని ఘోరం: ప్రియురాలిని చంపి, ప్రియుడి ఆత్మహత్య
కరీంనగర్/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Recommended Video

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మరణాలతో రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఐదేళ్లగా ప్రేమించుకుంటున్నారు..
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం అనంతారానికి చెందిన వొల్లాల ఎల్లయ్య-భారతమ్మల చిన్న కొడుకు మధు(25) హైదరాబాద్‌లోని ఓ బ్రెడ్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరి ఇంటి సమీపంలోనే ఉండే మిట్టపల్లి వెంకటమ్మ కుమార్తె సుస్మిత(22) బీఈడీ చదువుతోంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

పెళ్లికి ఒప్పుకోని యువతి తల్లి
కాగా, సుష్మిత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరుకావడం, కూతురు పుట్టినప్పుడే తనను భర్త వదిలేసి వెళ్లటం.. తనలాగే కూతురి జీవితం కాకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, వీరు దూరంగా ఉంటున్నట్లు నమ్మించేందుకు మధు హైదరాబాద్‌కు వెళ్లాడు.

సుస్మితను మధు ఫోన్
అయితే, గురువారం సిద్దిపేటలో మధు స్నేహితుడి వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన మధు సుస్మితకు ఫోన్ చేశాడు. అప్పటికే కళాశాలకు వెళ్లిన సుస్మిత అనుమతి తీసుకొని.. ఎప్పుడూ కలుసుకునే ముస్కాన్‌పేటలోని కోళ్లఫారం వద్దకు వెళ్లింది. మధు కూల్‌డ్రింక్, క్రిమిసంహారక మందు తీసు కొచ్చాడు.

ఒప్పుకోకపోవడంతో సుస్మితను చంపేశాడు
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో కలసి చనిపోదామని మధు ఆమెకు చెప్పాడు. అయితే, సుస్మిత ఇందుకు నిరాకరించి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, మధు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్నుపోయింది. తర్వాత ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు.

మిత్రులు వెళ్లేసరికే.. మధు కూడా
ఆ తర్వాత అతను కూడా కోళ్లఫారంలో దూలానికి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందే విషయాన్ని సిద్దిపేటలోని స్నేహితుడికి అతడు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. స్నేహితులు వచ్చి చూడగా, ఇద్దరూ శవాలై కనిపించారు. ఇరువురి కుటుంబాలకు వారు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications