ప్రేయసిని హత్య చేసిన ప్రియుడు: భార్యపై వేడినీళ్లు పోసిన భర్త
వరంగల్: పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ఓ యువకుడు ప్రియురాలిని హత్య చేసిన ఘటన వరంగల్‌లోని పోచమ్మ వైదాన్‌లో చోటుచేసుకున్నట్లు మట్టెవాడ సీఐ జె.శివరామయ్య తెలిపారు. తొర్రూరు మండలం కంటయ్యపాలెం గ్రామానికి చెందిన పెద్దగాని సంజీవ అలియాస్ సందీప్ ఎంజీఎం హాస్పిటల్ వద్ద అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ పరిధిలోని వాచ్యతండాకు చెందిన బానోతు సరోజ అలియాస్ స్వప్నతో సంజీవకు ఏడు నెలలుగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే సంజీవను పెళ్లి చేసుకోవాలంటూ స్వప్న ఒత్తిడి తేగా పెళ్లి ఇష్టం లేని సంజీవ తీవ్ర అసహనానికి గురయ్యాడు.

ఈ నెల 13న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసు భవనం వెనుకకు స్వప్నను తీసుకుపోయి ఇటుకతో తల పగులగొట్టి హత్య చేసినట్లు సీఐ శివరామయ్య తెలిపారు. కేసు నమోదు చేసి సంజీవను అరెస్టు చేసిరిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుంటే, ఆవేశంతో ఊగిపోయిన ఓ భర్త భార్యపై మరుగుతున్న వేడినీళ్లు పోయడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. వరంగల్‌లోని ఫోర్ట్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం భర్త వేడినీళ్లు పోయడంతో గాయపడిన భార్య చికిత్స పొందుతూ ఆస్పత్రిలో గురువారం మృతి చెందింది.












Click it and Unblock the Notifications