అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన వైయస్ జగన్
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.
కేసును విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో కోర్టుకు హాజరయ్యారు.

కాగా, హైకోర్టులో జగన్‌కు మినహాయింపుపై చుక్కెదురైన విషయం తెలిసిందే. కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలన్న జగన్ కోరికను హైకోర్టు తోసి పుచ్చింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని తెలిపింది.












Click it and Unblock the Notifications