కెసిఆర్ మోజు వల్లనే వరంగల్ ఎన్నిక: వర్షంలోనే జగన్ ప్రసంగం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మోజు పడ్డారని, అందుకే వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొర్రూరు ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.
వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక రావడానికి కెసిఆర్ కారణమని ఆయన అననారు. దళిత శాసనసభ్యులు ఇద్దరు ఉన్నా కూడా పార్లమెంటు సభ్యుడితో రాజీనామా చేయించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారా అని ఆయన అడిగారు.

ప్రతి పేదవాడి గుండెల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారని ఆయన అన్నారు. వర్షం పడుతున్నా వైయస్ జగన్ తన ప్రసంగాన్ని సాగించారు. అంతకు ముందు ఆయన రోడ్ షోలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జనగామ మీదుగా ఆయన పాలకుర్తి చేరుకున్నారు.
దుద్దేపల్లి, కొండాపురం, ఒగులాపురం, జఫర్ గఢ్, దమ్మన్నపేట, నందనంల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. వర్దన్నపేట సమీపంలోని పోలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, మంచి రోజులు వస్తాయని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications