అనూహ్యం: BJP ఎంపీతో సూరీడు భేటీ -YSR నీడను కలిశా: ధర్మపురి అరవింద్ -ys sharmilaపై చర్చా?

దివంగత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా, కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి సీఎం కేసీఆర్ పై పోరుబాట పట్టింది. షర్మిల ఎవరు వదిలిన బాణం? అనే చర్చ ఇంకా కొనసాగుతుండగానే, వైఎస్ కుటుంబంతో గాఢమైన అనుబంధం కలిగిన సూరీడు.. తెలంగాణ బీజేపీ ఎంపీ భేటీ కావడం అనూహ్యంగా మారింది.

బీజేపీ ఎంపీతో సూరీడు

బీజేపీ ఎంపీతో సూరీడు


వైఎస్సార్ సహాయకుడు సూరీడు తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిశారు. వైఎస్ మరణం తర్వాత దాదాపు కనుమరుగైపోయిన సూరీడు.. ఆ మధ్య తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. మొన్న మార్చి నెలలో హత్యాయత్నం వార్తలతో మళ్లీ ఆయన పేరు మారుమోగింది. సూరీడుపై ఆయన అల్లుడు(కూతురి భర్త) హత్యకు యత్నించడంతో కేసు నమోదైంది. మళ్లీ మూడు నెలల తర్వాత సూరీడు ఓ రాజకీయ ప్రముఖుడిని కలవడం చర్చనీయాంశమైంది.

వైఎస్సార్ నీడను కలిశా

వైఎస్సార్ నీడను కలిశా


ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం నాడు సూరీడుతో భేటీ అయినట్లు స్వయంగా వెల్లడించారు. ''#సూరీడు.. దివంగత నేత YSR నీడ ! చాలా కాలం తర్వాత మర్యాదపూర్వకంగా నా నివాసంలో కలిశారు. పాత జ్ఞాపకాలు పంచుకున్నాం'' అంటూ సూరీడుతో కలిసి దిగిన ఫొటోను అరవింద్ షేర్ చేశారు. కాగా,

Recommended Video

    YSRTP : YS Sharmila Met Party Leaders| Party Formation On July 8th | Oneindia Telugu
    వైఎస్ షర్మిల గురించి మాట్లాడారా?

    వైఎస్ షర్మిల గురించి మాట్లాడారా?

    బీజేపీ ఎంపీ అరవింద్, వైఎస్సార్ సహాయకుడు సూరీడుల భేటీపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల గురించి వీళ్లిద్దరూ మాట్లాడుకొని ఉండొచ్చని ఓ నెటిజన్ కామెంట్ పెడితే, అసలు షర్మిలను తెచ్చిందే బీజేపీ అయి ఉండొచ్చని మరొకరు, సూరీడు కూడా బీజేపీలో చేరుతున్నాడా? అని ఇంకొకరు వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యాన్ని నెలకొల్పేందుకే కొత్త పార్టీ పెడుతున్నట్లు వైఎస్ షర్మిల చెప్పగా, తెలంగాణలో రాజన్న రాజ్యం వద్దని, రామరాజ్యం కావాలని బీజేపీ ఎంపీ అరవింద్ గతంలోనే కౌంటరివ్వడం తెలిసిందే. '

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+