వైఎస్ జగన్ బాటలో షర్మిల: జనం మధ్య అసెంబ్లీ అభ్యర్థి పేరు ప్రకటన
సూర్యాపేట్: వైఎస్ షర్మిల నేతృత్వంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ జనం బాట పట్టింది. యువతను టార్గెట్‌గా చేసుకుంది. యువతను ఓటుబ్యాంక్‌గా మార్చుకుంటోంది. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో కొద్ది రోజులుగా ప్రతి మంగళవారం జిల్లాల్లో పర్యటిస్తోన్నారు వైఎస్ షర్మిల. మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాబాద్, సిరిసిల్ల.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరాహార దీక్షలు చేస్తోన్నారామె.

నిరుద్యోగ దీక్షతో యువతలో భరోసా..
విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం కిందటి వారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ మంగళవారం మరో జిల్లాలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్నట్టుగా భావిస్తోన్న లక్షా 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం ఈ నిరుద్యోగ దీక్షల ప్రధాన లక్ష్యం. ఈ ఆందోళనలకు నిర్వహించడం ఆరంభమైన తరువాత.. యువతలో వైఎస్సార్టీపీ మీద ఓ విశ్వాసం ఏర్పడిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సోమన్న అభ్యర్థిత్వం..
యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేసే విషయంలో వైఎస్ షర్మిల.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ నాయకుడు, తెలంగాణ జానపద గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం రాత్రి ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలోని అంగడి ఆవరణలో నిర్వహించిన దళిత భేరి బహిరంగ సభలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సోమన్న పోటీ చేస్తారని అన్నారు.

సోమన్న అభ్యర్థిత్వం..
యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేసే విషయంలో వైఎస్ షర్మిల.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ నాయకుడు, తెలంగాణ జానపద గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఆదివారం రాత్రి ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలోని అంగడి ఆవరణలో నిర్వహించిన దళిత భేరి బహిరంగ సభలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సోమన్న పోటీ చేస్తారని అన్నారు.

కేసీఆర్ పాలనపై
ప్రత్యేక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలకే- కేసీఆర్ పాలనను తప్పు పట్టిన ఘనత ఏపూరి సోమన్నకు ఉందని అన్నారు. ఎవడి పాలైందిరో తెలంగాణ.. ఎవడు ఏలుతున్నాడురో తెలంగాణ అంటూ గళమెత్తారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలకే కేసీఆర్ పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు సోమన్న తెలియజేశారని అన్నారు. అలాంటి నాయకులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఏపూరి సోమన్నను తుంగతుర్తి ప్రజల చేతుల్లో పెడుతున్నానని అన్నారు.

నిరుద్యోగ దీక్షకు సమాంతరంగా దళిత పోరాటాలు
నిరుద్యోగ నిరాహార దీక్షకు సమాంతరంగా ఇక వైఎస్ షర్మిల.. దళితుల తరఫున పోరాటాలను చేయనున్నారు. ఆ పోరాటానికి తిరుమలగిరి సభతోనే శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న దళితబంధు పథకం మోసపూరితమైనదనే విషయాన్ని వివరించడానికి ఆమె ప్రతివారం కూడా జిల్లాల పర్యటనకు వెళ్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగ నిరాహార దీక్ష తరహాలో ఎంపిక చేసిన జిల్లాలో సభలను నిర్వహించేలా ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించే యోచనలో ఉన్నారని అంటున్నారు.

వైఎస్ జగన్‌ను ఫాలో..
కాగా- అభ్యర్థిని ప్రకటించే విషయంలో వైఎస్ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యారు. ఇదివరకు వైఎస్ జగన్..రెండు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలా బహిరంగ సభ, పాదయాత్ర సందర్భంగా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు- కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ పేరును ప్రకటించారు.
Recommended Video

ఆ రెండు చోట్లా..
అదే నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో బుగ్గన పేరును ఖరారు చేశారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర నిర్వహిస్తోన్న సమయంలో పత్తికొండ నియోజకవర్గం అభ్యర్థి పేరును ఖరారు చేశారు. పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి పోటీ చేస్తారని వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ.. తన మొట్టమొదటి అభ్యర్థులను ప్రకటించిన ఈ రెండు సందర్భాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్, పత్తికొండలో కంగాటి శ్రీదేవి గెలుపొందారు.












Click it and Unblock the Notifications