కేటీఆర్, ఐటీ శాఖ పై పోలీసు స్టేషన్ లో షర్మిల ఫిర్మాదు..!!
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా షర్మిల కీలక ఆరోపణలు చేసారు. టీఎస్పీఎస్సీ కేసుల లీక్ పూర్తి బాధ్య కేటీఆర్ దే అని ఆరోపించారు. కేటీఆర్ తో పాటుగా ఆయన శాఖ పైన షర్మిల ఫిర్యాదు చేసారు. ఐటీ శాఖ వైఫల్యంపై మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. ఐటీ శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిట్ తో దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో ఐటీశాఖ వైఫల్యంపై బేగంబజార్ పీఎస్ లో షర్మిల కంప్లైంట్ చేశారు. పేపర్ లీక్ కేసులో ఐటీ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక ఐపీ అడ్రస్, పాస్ వర్డ్ తెలిసినంత మాత్రానా పేపర్ లీక్ చేయొచ్చా అని ప్రశ్నించారు. ఎవరు పడితే వాళ్లు సిస్టమ్ యాక్సిస్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ కేసులో ఐటీ శాఖ వైఫల్యంపై దర్యాప్తు చేయాలన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కేసు ఫైల్ చేయాలన్నారు. అసలు టీఎస్పీఎస్సీ అడిట్స్ బయటపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. సిస్టమ్స్ కు ఆడిట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చెప్పాలన్నారు. కామన్ మ్యాన్ కు అంత సులభంగా ఐపీ అడ్రస్ ఎలా తెలుస్తందని ప్రశ్నించారు.

బిశ్వాల్ కమిటీ దాదాపు రెండు లక్షల ఉద్యోగాలున్నాయని ఖాళీగా ఉన్నాయని చెప్పిందని షర్మిల గుర్తు చేసారు. తొమ్మిదేళ్లు అవుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఇంత వరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ దీక్షలు చేస్తే మంత్రులు అవమానించారని, అయినా దీక్షలు చేశామని చెప్పారు.విద్యార్థుల కోసం కొట్లాడుతుంటే ఆడబిడ్డ అని చూడకుండా నన్ను జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. సిట్ దర్యాప్తు ప్రగతి భవన్ నుండే నడుస్తోందని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి సిస్టంకి ఐటీ శాఖనే బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications