ఏపీలో సీఎం జగన్.. తెలంగాణలో వైఎస్ షర్మిల: ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపిన నేతలు

హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. పాదయాత్రలో భాగంగా ఆమె ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రగా ఉన్న ఆమె సోదరుడు కూడా రైతులకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన కూడా ట్రాక్టర్ నడిపి సందడి చేయడం గమనార్హం. ఇటు తెలంగాణలో సోదరి, ఏపీలో సోదరుడు ఒకేసారి ఇలా ట్రాక్టర్ నడిపి సందడి చేయడం ఆకర్షిణీయంగా మారింది.

ట్రాక్టర్ నడిపి రైతుల్లో భరోసా నింపిన వైఎస్ షర్మిల

ట్రాక్టర్ నడిపి రైతుల్లో భరోసా నింపిన వైఎస్ షర్మిల

వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపారు వైఎస్ షర్మిల. వారందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 'రైతు రాజ్యమే మా లక్ష్యం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం.. రైతు బాగు కోసమే మా పోరాటం.. అని వ్యాఖ్యానించారు.

అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందంటూ షర్మిల

అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందంటూ షర్మిల


కాగా, ప్రజాప్రస్థానంలో వైయస్ఆర్‌ను తలుచుకోని గుండె లేదు. మంచి మ‌న‌సున్న నాయ‌కుడు మన వైయ‌స్ఆర్. ఆ మ‌హానేత ప‌థ‌కాలు ప్ర‌తి గ‌డ‌ప‌నూ తాకాయి. ప్ర‌తి గుండెనూ తాకాయి. కోట్లాది మంది వైయ‌స్ఆర్ బ‌తికే ఉన్నార‌ని ఆయ‌న్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు.నేడు వైయ‌స్ఆర్ పాల‌న లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నారు. వైయ‌స్ఆర్ ప‌థ‌కాల‌ను లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న తెచ్చేందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

కేసీఆర్, ప్రతిపక్షాలకు సోయి తెప్పించామన్న షర్మిల

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ఏనాడూ దృష్టి పెట్టలేదు. వందల మంది చనిపోతున్నా దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఉద్యోగాల కోసం రాష్ట్రం సాధించుకుంటే..స్వరాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు మిగిల్చాడు కేసీఆర్.కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం తొలగించాడు. నోటిఫికేషన్లు లేవు. స్కిల్ డెవలప్ మెంట్ లేదు. విభజన హామీలనూ మర్చిపోయాడు. 27వారాలుగా మేం నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం.మా పోరాటం వల్లే ప్రభుత్వానికి బుద్ధి వచ్చింది. ప్రతిపక్షాలకు సోయి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లపైనే మా మొదటి సంతకం ఉంటుందని వైఎస్ షర్మిల తెలిపారు.

ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన వైఎస్ జగన్

ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపిన వైఎస్ జగన్

ఇది ఇలావుండగా, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కూడా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. వైయస్సార్ యంత్ర సేవా పథకం రాష్ట్రస్థాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన ట్రాక్టర్ నడిపారు. 5260 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ. 175 కోట్ల సబ్సిడీ జమ చేశారు. రానున్న రోజుల్లో రైతుల కోసం మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+