బాల్క సుమన్ కాదు.. కేసీఆర్ దొరకు బానిస సుమన్: చెన్నూరులో వైఎస్ షర్మిల; తగ్గేదేలే!!

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాదయాత్రలో చెన్నూరు నియోజకవర్గం లో పాదయాత్ర చేసిన షర్మిల చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను టార్గెట్ చేశారు. బాల్క సుమన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని, గూండాగిరి చేయడంలోనే బాల్క సుమన్ కు సరిపోతుందని వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బాల్క సుమన్ పై విరుచుకుపడిన వైఎస్ షర్మిల


తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ విద్యార్థి నాయకుడి నుంచి ఎమ్మెల్యే అయి, ఆపై ఎమ్మెల్యే నుంచి రౌడీగా,గూండాగా మారాడని వైయస్ షర్మిల మండిపడ్డారు. బాల్క సుమన్ ను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి, బెదిరింపులకు పాల్పడతాడని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గంలో చెయ్యని దందా లేదని, నియోజకవర్గాన్ని నిలువునా దోచుకుంటున్నారు అంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు జేబులో 100 రూపాయలు కూడా లేని బాల్క సుమన్, ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు.

బాల్క సుమన్ కేసీఆర్ దొరకు బానిస సుమన్ గా మారాడు


నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా భూమిని వదిలిపెట్టకుండా కబ్జాలు చేస్తాడని, ఇసుక దందా చేస్తున్నాడని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కూడా వదలకుండా, వారిని కూడా టార్గెట్ చేసి వారిపై దాడులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా బాల్క సుమన్, కేసీఆర్ దొరకు బానిస సుమన్ గా మారాడని వైయస్ షర్మిల ఆరోపించారు. దొర పక్కన కూర్చునే సరికి దొర పోకడలు బాల్క సుమన్ కు వచ్చాయని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

కేసీఆర్ కు ఓపెన్ కాస్ట్ లు బంద్ చేయించటానికి ఇంకా కుర్చీ దొరకలేదా?


ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్ లు వుండవని, కుర్చీ వేసుకుని మరీ ఓపెన్ కాస్ట్ లను బంద్ చేయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్, ఇంతవరకు ఎందుకు బంద్ చేయించలేదని, ఆయనకు కుర్చీ దొరకలేదా అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. ఇక చెన్నూరు నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ చేసింది సున్నా అన్ని వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల తుమ్మిడిహెట్టిలో తట్టెడు మట్టి తీయలేదు.. ఏం చేసినట్టు అని ప్రశ్నించారు.

 బాల్క సుమన్ ఒక్కసారైనా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు?

బాల్క సుమన్ ఒక్కసారైనా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు?


గొల్లవాగులో ఒక్క కాల్వ కట్టలేదు అని మండిపడ్డారు. లెదర్ పార్క్ ఎటు పోయిందో చెప్పాలన్నారు. రెవెన్యూ డివిజన్ ఊసే లేదని అసహనం వ్యక్తం చేశారు. మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేవు ఎందుకని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి పేరు వస్తుందనే నాడు వైయస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ దొర బంద్ పెట్టాడని వైయస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని రెచ్చగొట్టి, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఎమ్మెల్యే బాల్క సుమన్..తెలంగాణ వచ్చాక నోటిఫికేషన్ల కోసం ఎందుకు కొట్లాడలేదు? అని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఒక్కసారైనా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+