కొడంగల్ బరిలో షర్మిల, రేవంత్ పై రివేంజ్ - సర్వేలు ఏం తేల్చాయి..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ లక్ష్యంగా సొంత పార్టీ సీనియర్లు టార్గెట్ చేస్తూ..పార్టీని వీడుతున్నారు. అటు కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించిన షర్మిల ఇప్పుడు ఒంటరి పోరుకు సిద్దమయ్యారు. పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన షర్మిల రెండో స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. అయితే, షర్మిల ఇప్పుడు కొడంగల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 18న జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి ఖాయమని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ కొడంగల్ నుంచి మరోసారి పోటీకి సిద్దమయ్యారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ ఓడిపోయారు.

YS Sharmila likely ot contest from Kodangal against Revanth Reddy in next Elections

అక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ది పట్నం నరేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో రేవంత్ కు ఇక్కడ గెలుపు కీలకం కానుంది. ఈ సమయంలోనే కొడంగల్ కేంద్రంగా సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి పోటీకి సిద్దమయ్యారు. రెండో స్థానంగా కొడంగల్ వైపు చూస్తున్నట్లు సమాచారం.

కొడంగల్ నుంచి షర్మిల : వైఎస్సార్టీపిని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి సిద్దపడినా..రేవంత్ కారణంగానే షర్మిల ప్రతిపాదనలను కాంగ్రెస్ అమోదించలేదని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో షర్మిల జోక్యం వద్దంటూ రేవంత్ తన మద్దతు దారులతో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద బలంగా వాదించారు. తాను తెలంగాణకే పరిమితం అవుతానని షర్మిల తేల్చి చెప్పారు. ఫలితంగా కాంగ్రెస్ తో షర్మిల ప్రయత్నాలు ఫలించలేదు.

దీంతో, ఇప్పుడు రేవంత్ కు కొడంగల్ లోనే షాక్ ఇవ్వాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని షర్మిల ప్రకటించారు. తొలి నుంచి చెబుతున్నట్లుగా పాలేరు తో పాటుగా మరో స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కొడంగల్ లో సామాజిక - ప్రాంతీయ సమీకరణలు తనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్న షర్మిల..ఇప్పటికే అక్కడ సర్వేలు చేయించారనే ప్రచారం సాగుతోంది.

YS Sharmila likely ot contest from Kodangal against Revanth Reddy in next Elections

షర్మిల వర్సస్ రేవంత్ : రేవంత్ 2014లో కొడంగల్ లో గెలిచారు. ఇప్పుడు రేవంత్ ను ఓడించేందుక బీఆర్ఎస్ ముందుకు నుంచి పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. తాజాగా రేవంత్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల కొడంగల్ లో పాదయాత్ర చేసిన సమయంలోనూ రేవంత్ ను టార్గెట్ చేసారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆ సమయంలో షర్మిలకు మద్దతుగా నిలిచారు.

ఇప్పుడు గుర్నాధరెడ్డి తిరిగి కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నా..షర్మిల బరిలో ఉంటే ఆయన పాత్ర కీలకం కానుంది. సామాజిక సమీకరణాలే...పార్టీల బలాబలాల్లో రేవంత్ వర్సస్ పట్నం మధ్య పోటీలో షర్మిలకు కలిసి వస్తుందనేది వైఎస్సార్టీపి నేతల అంచనా. దీంతో, సర్వే ఫలితాల ఆధారంగా షర్మిల కొడంగల్ పైన తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+