మునుగోడులో గెలిచేదెవరో తేల్చిన షర్మిల : అన్న కాదు - నాన్నే నాకు..!!
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేదెవరో జోస్యం చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్ అని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి పైన కాంగ్రస్ - బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు విమర్శలకే పరిమితం అవుతున్నారన్నారు. కేంద్రమంత్రులు ఎందుకు విచారణ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు.
ఈ స్కాం 2G స్కాం కన్న పెద్దదిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పక్షం లేదు.... బండి సంజయ్, రేవంత్ రెడ్డి మెగా కృష్ణా రెడ్డికి తొత్తులని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగటం లేదని..అందుకే తాము పోటీ చేయటం లేదని షర్మిల చెప్పుకొచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్ల నుంచి పోటీ చేస్తుందని చెప్పారు. తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేసారు. ఇదే సమయంలో మునుగోడులో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందనేది తనకు ఉన్న సమచారమని షర్మిల చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు పైన షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. తన రోల్ మోడల్ అన్న జగన్ కాదని... నాన్న రాజశేఖరరెడ్డి అంటూ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.

తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదన్నారు. తన పాదయాత్ర ముగింపుకు ఎవరిని ఆహ్వానించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. మునుగోడులో ఇప్పుడు హోరా హోరీగా సాగుతున్న ప్రచారం. ...మూడు ప్రధాన పార్టీలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కర చర్చకు కారణమవుతున్నాయి. తాజాగా.. ఏపీలో ఎన్టీఆర్ వర్సిటీ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు చేర్చటాన్ని షర్మిల వ్యతిరేకించారు. వివేకా హత్య కేసు వ్యవహారంలోనూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఇలా.. కీలక అంశాలకు సంబంధించి షర్మిల చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు కలకలరం రేపుతున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల నాటికి షర్మిల తన పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారు.. ఏ విధంగా ముందడుగు వేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications