కేసీఆర్ కు మళ్ళీ గిఫ్ట్ పంపిస్తున్నా.. కొత్త సచివాలయం ముందు పెట్టుకోండి: వైఎస్ షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన షర్మిల అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా పట్టించుకునే నాథుడు లేడని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అనేకమార్లు సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ లు పంపానని, ఇప్పుడు కూడా కేసీఆర్ కు గిఫ్ట్ పంపిస్తున్నానని పేర్కొన్నారు.

తడిసిపోయిన ధాన్యాన్ని కెసిఆర్ కు గిఫ్టుగా పంపిస్తున్నామని వైయస్ షర్మిల వెల్లడించారు. అకాలవర్షాల ధాటికి నేల రాలిపోయిన మొక్కజొన్నను కూడా ట్రక్కులో పంపిస్తున్నాను అని షర్మిల పేర్కొన్నారు. రైతులు తమ భార్యల పుస్తెలు కుదువ పెట్టి పంట పండిస్తే రైతులకు మిగిలింది ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. మీ కొత్త సచివాలయం ముందు ఈ ట్రక్కును పెట్టుకుంటే అప్పుడైనా మీకు రైతులకు సహాయం చేయాలన్న సోయి వస్తుందేమోనని చురకలంటించారు.

 YS Sharmila send gift to CM KCR and demanded compensation for farmers

తాము పంపిస్తున్న తడిసిన ధాన్యం ట్రక్కును సచివాలయం లేదా ప్రగతి భవన్ ముందు పెట్టుకోవాలని, తాను పంపించే ట్రక్కు లో ఉన్నది ధాన్యం కాదని, రైతుల కన్నీళ్లు అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయని పేర్కొన్న వైయస్ షర్మిల, నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారన్నారు.

ఐకేపీ సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయడం లేదని అకాల వర్షాల దెబ్బకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలన్నారు. మిల్లర్లు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, తక్షణమే ఐకెపి సెంటర్లను తెరిచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని షర్మిల డిమాండ్ చేశారు.

రైతులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కెసిఆర్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కిసాన్ బర్బాద్ సర్కార్ అంటూ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. అకాల వర్షంతో రాష్ట్రంలో 9 లక్షల ఎకరాల్లో పైగా పంట నష్టం జరిగిందని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతులకు రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని పంట నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి 20 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నానని వైయస్ షర్మిల వెల్లడించారు.

కెసిఆర్ దిక్కుమాలిన పాలన చేస్తున్నారని, ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు కరప్షన్ చంద్రశేఖర్ గా మారారని వైయస్ షర్మిల ఆరోపణలు గుప్పించారు. పంట నష్టపోయిన రైతులు బాధలో ఉంటే, కెసిఆర్ కనీసం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+