వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ పై వైఎస్ షర్మిల.. దోషులెవరో తేలాల్సిందే.. సీబీఐ ఎంక్వైరీ డిమాండ్!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారం అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం కాగా ఈ వ్యవహారంపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కూడా తనదైన శైలిలో స్పందించారు. అటు టిఆర్ఎస్ పార్టీని, ఇటు బిజెపి ని రెండింటిని టార్గెట్ చేసి షర్మిల నిప్పులు చెరిగారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ రచ్చ.. సీబీఐ విచారణకు వైఎస్ షర్మిల డిమాండ్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి వైయస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు నిర్దోషులే అయితే.. మీకు అంత నమ్మకం ఉంటే.. మీ ఎమ్మెల్యేలు, మీరు నిజాయితీపరులే అయితే... వెంటనే సీబీఐతో విచారణ జరిపించండి అని వైయస్ షర్మిల సవాల్ చేశారు.

దోషెవరో .. నిర్దోషి ఎవరో? తేలాలన్న షర్మిల

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్మాలనుకున్నది ఎవడో.. కొనాలనుకున్నది ఎవడో తేల్చండి అంటూ నిప్పులు చెరిగారు.దొరెవడో, దొంగెవడో.. దోషెవడో...నిర్దోషెవడో బయటపెట్టండి అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నీతిమంతుడు ఎవడో.. రాజకీయ వ్యభిచారి ఎవడో ప్రజల ముందుపెట్టండి. అహంకారానికి ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవ అమ్మకానికి మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగంలో దొరికిన దొంగలను తెలంగాణ సమాజం నుంచి వెలివేయాలి అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. మౌనం అర్ధాంగీకారం చిన్న దొర.. సి.బి.ఐ ఎంక్వైరీ వేయకుంటే తప్పు అంగీకరించినట్టే అని వైయస్ షర్మిల టిఆర్ఎస్ ను టార్గెట్ చేశారు.

తెలంగాణా ఆత్మగౌరవాన్ని అమ్మాలనుకున్నది.. కొనాలనుకున్నది ఎవరో?

ఇక తాజాగా ఖానాపూర్ లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో మాట్లాడిన వైయస్ షర్మిల డబ్బులు ఇస్తూ పట్టుబడిన బిజెపి వాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు, డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అడ్డంగా దొరికిన ఎమ్మెల్యేలను కెసిఆర్ ఎందుకు దాస్తున్నారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్మాలనుకున్నది ఎవరో కొనాలనుకున్నదెవరో నిగ్గు తేల్చాలి. దీనిపై సి.బి.ఐ విచారణ జరిపించాలని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన ఆ ఎమ్మెల్యేలు అమాయకులా?

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన ఆ ఎమ్మెల్యేలు అమాయకులా?

ఎమ్మెల్యేలు అమాయకులు అయితే కెసిఆర్ ఎందుకు దాచి పెట్టుకున్నారు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్ముడుపోయి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అమాయకులు ఎలా అవుతారో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎందుకు దీనిపై సిబిఐ దర్యాప్తు ఆదేశించడం లేదని వైయస్ షర్మిల ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్దోషులు అయితే టిఆర్ఎస్ పార్టీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీని కోరడం లేదు చెప్పాలన్నారు వైయస్ షర్మిల.

టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ బూమరాంగ్ అవుతుందా? బోలెడు లాజిక్స్.. హాట్ డిబేట్!!టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్ బూమరాంగ్ అవుతుందా? బోలెడు లాజిక్స్.. హాట్ డిబేట్!!

English summary
YS Sharmila reacts on MLA's purchase episode. They targeted TRS and BJP and set them on fire saying that it would be clear if the CBI inquires who is honest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X