మునుగోడు వీధుల్లో కుక్కల కొట్లాట; ఢిల్లీలో కవితకోసం కేసీఆర్ వెంపర్లాట: వదిలిపెట్టని వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాలన పరిస్థితిపై ప్రజాప్రస్థానం పాదయాత్రలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రంలో పరిస్థితి పై విరుచుకుపడ్డారు.

మునుగోడులో ఓట్లు కొంటున్నారు: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో పరిపాలన గాలికొదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల నేతలు మునుగోడు ఉప ఎన్నికలలో కుక్కల కొట్లాటకు తెర తీశారని వైయస్ షర్మిల విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉప ఎన్నికల్లో ఊరికొక్క ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించి మందు సీసాలు, నాటు కోళ్లు, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతూ, ఓటు కొంటున్నారని వైయస్ షర్మిల ఆరోపించారు. ఇక సీఎం కేసీఆర్ తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్లి పైరవీలకు తెర తీశారని వైయస్ షర్మిల విమర్శించారు.
జుక్కల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి
రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ అభివృద్ధిని విస్మరించారని, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. వైయస్సార్ బ్రతికుంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వారన్నారు. వైయస్సార్ 450 కోట్ల రూపాయలతో నిజాంసాగర్ కాల్వలకు మరమ్మతులు చేయించి మూడు లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తే, కెసిఆర్ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని వైయస్ షర్మిల కేసీఆర్ ను ప్రశ్నించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మునుగోడుపై పడ్డారు
ఇక మునుగోడు ఉప ఎన్నికల టార్గెట్ షర్మిల మునుగోడులో వీధుల్లో కుక్కల కొట్లాట కొనసాగుతుందని మండిపడ్డారు. ఒక్క నియోజకవర్గం కోసం 118 నియోజకవర్గాలు గాలికొదిలి ఎమ్మెల్యేలు, మంత్రులంతా మునుగోడుపై పడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన కూతురును కాపాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నాడని పేర్కొన్న షర్మిల ప్రజల గురించి పట్టించుకునే నాథుడే లేడు అని అసహనం వ్యక్తం చేశారు.
జుక్కల్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
ఇక తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేనియోజకవర్గాన్ని గాలికొదిలి, ఒక్కో మండలాన్ని తన అనుచరులకు అప్పగించాడట అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు. వారితో దందాలు చేయించి, వాటాలు తీసుకుంటాడట. ఇసుక మాఫియా కింగ్ అట. గూండాయిజానికి రాజు అట. ప్రశ్నిస్తే కేసులు పెట్టి దాడులు చేస్తాడని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యే కు సిగ్గు ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో వైఎస్సార్ సంక్షేమ పాలన సాధన కోసం చేపట్టిన పాదయాత్రలో తనకు ప్రజలు ఎంతగానో మద్దతిస్తున్నారని పేర్కొన్న షర్మిల, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications