వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా -జగన్‌కు గట్టు శ్రీకాంత్ రెడ్డి లేఖ -వైఎస్ షర్మిలకు షాకిస్తూ, బీజేపీ వైపు

|
Google Oneindia TeluguNews

వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పూర్తిగా కనుమరుగు కానున్నది. ఏపీలో అధికారంలో కొనసాగుతోన్న తాము.. తెలంగాణలో పార్టీని విస్తరించదల్చుకోలేదని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కీలక నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా వైసీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సైతం శనివారం తన రాజీనామాను ప్రకటించారు. ఈ మేరకు అధినేత జగన్ కు రాసిన లేఖలో గట్టు పలు కీలక అంశాలను ప్రస్తావించారు..

ప్రసంగం మధ్యలోనే ఆపేసిన మోదీ -బీజేపీ కార్యకర్త కోసం పీఎంవో డాక్టర్ల పరుగులు -అస్సాంలో అనూహ్యం: videoప్రసంగం మధ్యలోనే ఆపేసిన మోదీ -బీజేపీ కార్యకర్త కోసం పీఎంవో డాక్టర్ల పరుగులు -అస్సాంలో అనూహ్యం: video

 బరువెక్కిన గుండెతో నిర్ణయం..

బరువెక్కిన గుండెతో నిర్ణయం..

తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధనేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని అధినేత నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బరువెక్కిన గుండెతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు.

 జగన్ ఇంకా గొప్ప స్థానాలకు..

జగన్ ఇంకా గొప్ప స్థానాలకు..

ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తికి, వైసీపీకి దూరం కావడం చాలా బాధగా ఉందని గట్టు శ్రీకాంత్ రెడ్డి తన రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. తనకు 2007 నుంచి జగన్‌తో పరిచయం ఉందని, ఇప్పటివరకూ ఆయనపై ఉన్న నమ్మకంతో వెంట నడిచానని, జగన్ భవిష్యత్‌లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి.. వైసీపీని వీడి, జగన్ సోదరి వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతారని అంతా భావించారు. కానీ..

షర్మిలకు షాక్.. బీజేపీలోకి గట్టు

షర్మిలకు షాక్.. బీజేపీలోకి గట్టు

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటోన్న వైఎస్ షర్మిల నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నానన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి.. షర్మిలతో ఎలాంటి విభేదాలు లేవని, ఆమెకు బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెబుతానని అన్నారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. భవిష్యత్తులో జాతీయ పార్టీ తరఫునే హుజుర్ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి రాజీనామాపై వైసీపీ హైకమాండ్ స్పందించాల్సి ఉంది.

viral video:చిరుతతో నోముల భగత్ సరదా వాక్ -సాగర్ పోరులో టీఆర్ఎస్‌కే ఓటన్న ఆర్జీవీ -3నామినేషన్లు వెనక్కిviral video:చిరుతతో నోముల భగత్ సరదా వాక్ -సాగర్ పోరులో టీఆర్ఎస్‌కే ఓటన్న ఆర్జీవీ -3నామినేషన్లు వెనక్కి

English summary
ys jagan led ysrcp telangana party president gattu srikanth reddy quits party. srikanth reddy on saturday announced his resignation to ysrcp and sends the letter to party chief and ap cm ys jagan. earlier ysrcp has declared that it has no plan to expand party in telangana, gattu srikanth reddy likely to join bjp soon. he commented on ys sharmila party too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X