షర్మిల నియోజకవర్గం ఫిక్స్ - ఆ సమీకరణాలే కీలకంగా : అధ్యక్షా అంటారా
వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ లో రాజకీయ పార్టీ స్థాపన.. పాదయాత్ర ద్వారా ఇప్పుడు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న షర్మిల..రానున్న ఎన్నికల పైన ఫోకస్ పెట్టారు. పార్టీ ఏర్పాటు ద్వారా..తన తండ్రి హాయంలో జరిగిన మంచిని వివిరిస్తూ..ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదే సమయంలో షర్మిల పార్టీ ఏర్పాటు తరువాత అంచనా వేసిన విధంగా పెద్ద స్థాయి నాయకులు ఎవరూ వైఎస్సార్టీపీలో చేరలేదు. అయితే, తనకు నేతలు అవసరం లేదని..తనతో కలిసొచ్చే వారే నేతలుగా ఎదుగుతారని షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ ను ఢీ కొట్టి అధికారంలోకి వస్తామంటూ బీజేపీ..కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

షర్మిల నియోజకవర్గం ఖరారు
ఇదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల సమాయత్తంలో భాగంగా.. తాను పోటీ చేసే నియోజకవర్గం పైన నిర్ణయానికి వచ్చారు. తన అన్న జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ ఏర్పాటు సమయం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న షర్మిల..ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షురాలి హోదాలో వచ్చే ఎన్నికల్లో తొలి సారి బరిలోకి దిగబోతున్నారు. ఇందు కోసం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారు. గతంలోనే దీనికి సంబంధించి ప్రచారం సాగినా.. ఇప్పుడు షర్మిల పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇదే అంశం పైన ఈనెల 19న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సర్వే నివేదికలతో ముందడుగు
చాలా కాలంగా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గంలో గిరిగిజన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నంత వరకూ ఈ నియోజకవర్గం లో ఆయన పట్టు కొనసాగింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత సమస్యలు.. సామాజిక సమీకరణాలు తనకు కలిసి వస్తాయని షర్మిల అంచనా వేస్తున్నారు.

తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి
దీంతో పాటుగా హైదరాబాద్ నగర పరిధిలోని మరో అసెంబ్లీ నియెజకవర్గం పైన ఫోకస్ పెట్టారని పార్టీలో ప్రచారం సాగుతోంది. కానీ, అన్ని కోణాల్లో పరిశీలన చేసిన తరువాత పాలేరు పైనే షర్మిల ఫిక్స్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో షర్మిల టీం ప్రత్యేకంగా స్థానికుల సమస్యలు.. షర్మిల వారికి దగ్గరయ్యేలా ఎలా ముందుకు వెళ్లాలనే దాని పైన కసతర్తు ప్రారంభించింది. షర్మిల రాజకీయంగా తొలి సారి చట్ట సభలకు పోటీ చేస్తున్న నియోజకవర్గం కావటంతో..అక్కడ పోటీ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications