పొత్తుపై తేల్చేసిన షర్మిల - బీఆర్ఎస్ ఒక తుగ్లక్ ఆలోచన : ముందస్తు పైనా..!!

తెలంగాణలో తన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందనే అంశం పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ దిశగా చేస్తున్న ఆలోచన పైన స్పందిస్తూ..బీఆర్ఎస్ ఒక తుగ్లక్ ఆలోచనగా అభివర్ణించారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణ లో ముందస్తు ఎన్నికల ముచ్చటే ఉండదని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు సమీకరణాలు మారుతాయని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్టీపీ స్థాపించి ఏడాది పూర్తయిందని..ఈ సంవత్సర కాలంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందని షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పటికే 1500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసినట్లుగా వివరించారు.

వైఎస్సార్ కు ద్రోహం చేసింది

వైఎస్సార్ కు ద్రోహం చేసింది

వైఎస్సార్ హాయంలో చేసిన సంక్షేమ పాలన ప్రతీ గుండెను .. ప్రతీ గడపను తాకిందని షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ప్రజా సేవలో ఉండి మరణించారని చెప్పారు. ఆయనకు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ లాంటి నగరంలో ఒక సెంటు భూమి కూడా లేదన్నారు. కాంగ్రెస్ ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ ను కాంగ్రెస్ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిందన్నారు. ఆయనకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. ఆ శాపమే ఇప్పుడు కాంగ్రెస్ - టీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను అభిమానిస్తున్నారు కానీ, వైఎస్సార్ ను గుర్తించక పోవటం వెనుక ఉద్దేశాలు స్పష్టం అవుతున్నాయని చెప్పారు.

వైఎస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి

వైఎస్సార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలి


నాడు రోశయ్య వైఎస్సార్ మెమోరియల్ కోసం 20 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారన్నారు. కానీ, ఆ ప్రతిపాదన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. 2004లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ తో పొత్తు కుదిరేలా చేసి..కేంద్రంలో కేసీఆర్ కు మంత్రి పదవి వచ్చేలా చేసారన్నారు. కేసీఆర్ కు కేంద్రం లో మంత్రిగా చేయటంలో..హరీష్ ను రాష్ట్రంలో మంత్రిగా చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన స్పందించారని..కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వదిలేస్తారా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ ను సీఎం చేసింది వైఎస్సారే

కేసీఆర్ ను సీఎం చేసింది వైఎస్సారే


టీఆర్ఎస్ కార్యాలయానికి స్థలం వైఎస్సార్ ఇచ్చారని గుర్తు చేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ గురించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ దొంగ.. అడ్డంగా దొరికారు. ఆయన చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రోశయ్య కేబినెట్ లో సబితా, దానం నాగేందర్ ఉన్నారని గుర్తు చేసారు. వీరికి రాజకీయంగా వైఎస్సార్ జన్మనిచ్చారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మెమోరియల్ హైదరాబాద్ లో ఉండాలని షర్మిల డిమాండ్ చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా..వైసీపీ పైన స్పందించేందుకు షర్మిల నిరాకరించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+