బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్‌ను బయటికి పంపిన కోమటిరెడ్డి: ఇదేం పాలన? అంటూ మాజీ మంత్రుల ఫైర్

యాదాద్రిభువనగిరి: బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతుబంధు అడిగినవారిని చెప్పుతో కొట్టాలని అనడం సరైంది కాదన్నారు బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి.

బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది దఫాలుగా రైతుబంధు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుబంధు 10 వేలు కాదు రూ. 15వేలు ఇస్తామన్నారని సందీప్ రెడ్డి గుర్తుచేశారు. పెన్షన్ కూడా 2 వేలు కాకుండా రూ. 4వేలు ఇస్తామన్నారని తెలితపారు. రైతు తీసుకున్న రుణాలు 9వ తేదీన మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు.. తిరిగి రైతులను తిట్టడం సరికాదంటూ రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 zp chairman sandeep reddy argument with komatireddy venkat reddy in meeting: minister fires at brs

ఈ క్రమంలో సందీప్ రెడ్డి ప్రసంగాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ సర్కారే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఇక సందీప్ రెడ్డి చేసిన విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. తల్లిదండ్రుల పేరుతో జడ్పీ ఛైర్మన్ అయిన వ్యక్తి తన ముందు మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో సభలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిని సభ నుంచి బయటకు పంపాలను పోలీసులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. వెంటనే పోలీసులు సందీప్ రెడ్డిని సమావేశం నుంచి బయటకు పంపారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్‌ పట్ల మంత్రి, పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డికి కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదేనా ప్రజాపాలన ?: హరీశ్ రావు
కాంగ్రెస్ 'ప్రజాపాలన''లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయం. మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. నేడు యాదాద్రి భువన గిరి జెడ్పి ఛైర్మన్ సందీప్ రెడ్డి పై అధికారిక కార్యక్రమం లో అకారణంగా దుర్భాష లాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

మాట్లాడింది చాలదన్నట్టు మంత్రి పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డి ని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్య వాదులంతా కోమటి రెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలి. కోమటి రెడ్డి కి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా ..జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+