ఏపీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పెట్టుబడి - దేశంలోనే రెండో అతిపెద్ద యూనిట్ ఏర్పాటు

చిత్తూరు: ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్.. ఏపీలో పెట్టుబడి పెట్టనున్నారు. కొత్త యూనిట్‌ను నెలకొల్పనున్నారు. తన సొంత జిల్లా చిత్తూరులో దీన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు కూడా. అమర రాజా బ్యాటరీస్‌కు అనుబంధ సంస్థ మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఆయన జిల్లాలో స్థాపించబోతోన్నారు. పెట్టుబడి విలువ 250 కోట్ల రూపాయలు.

విస్తరణ..

విస్తరణ..

తిరుపతి సమీపంలోని కరకంబాడి వద్ద ఇప్పటికే మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్ కొనసాగుతోంది. దీన్నిమరింత విస్తరించడానికి సన్నాహాలు చేపట్టిందా కంపెనీ యాజమాన్యం. జిల్లాలోని తేనేపల్లిలో దీన్ని నెలకొల్పబోతోన్నట్లు ప్రకటించింది. 250 కోట్ల రూపాయల మొత్తం పెట్టుబడితో కొత్తగా 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్‌ను స్థాపించనున్నట్లు గల్లా జయదేవ్ తెలిపారు.

ఆటో కాంపోనెంట్స్..

ఆటో కాంపోనెంట్స్..

ఈ యూనిట్‌లో మంగళ్ ఇండస్ట్రీస్ ఆటో కాంపోనెంట్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్, బ్యాటరీ కాంపోనెంట్స్, టూల్ వర్క్స్, స్టోరేజీ సొల్యూషన్స్, కస్టమ్ ఫ్యాబ్రికేషన్‌లో ఉత్పత్తులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అశోక్ లేలాండ్, బోర్గ్‌వార్నర్, బాష్, ఏబీబీ, అల్‌స్ట్రామ్, ఫాక్స్‌కాన్, మాండో వంటి అతిపెద్ద బ్రాండ్‌లకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది మంగళ్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన తయారీ కేంద్రాల్లో మూడువేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తోన్నారు.

తయారీ యూనిట్లు పెంపు..

తయారీ యూనిట్లు పెంపు..

తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర రాజా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్ మాట్లాడారు. ఈ ప్రాంతంలో తమ తయారీని పెంచడానికి, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. కొత్తగా ప్రతిపాదించిన మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా మరింత మందికి ఉద్యోగాలను కల్పించనున్నామని చెప్పారు. కనీసం వెయ్యి మందికి పైగా కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి అవకాశం లభించిందని పేర్కొన్నారు.

1,000 మందికి ఉద్యోగాలు..

1,000 మందికి ఉద్యోగాలు..

మంగళ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్ధన గౌరినేని మాట్లాడుతూ, తేనేపల్లిలో కొత్తగా నెలకొల్పదలిచిన ఈ ప్లాంట్‌లో సోలార్ పవర్‌తో పాటు ఇతర కస్టమ్ ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తుల వంటి పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన విడి భాగాలను తయారు చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు రాగానే కొత్త ప్లాంట్ పనులు వెంటనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.

గల్లాపై విమర్శలు..

గల్లాపై విమర్శలు..

కాగా- ఇదివరకు పెట్టుబడులు పెట్టే విషయంలో గల్లా జయదేవ్ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణలో 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ఆయన ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది కాస్తా ఏపీలో రాజకీయ వేడిని రగిలించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు విసుగు చెంది రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్తోన్నాయంటూ టీడీపీ నేతలు విమర్శించారు.

కొత్త యూనిట్..

కొత్త యూనిట్..

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకుని రావడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడున్న కంపెనీలను కూడా వైసీపీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తోన్నారని, వాటి యాజమాన్యాల నుంచి పెద్ద కమీషన్లను డిమాండ్ చేస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ వైఖరితో విసిగి పోయిన పారిశ్రామిక వేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తోన్నాయంటూ గల్లా జయదేవ్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపించారు. అదే గల్లా జయదేవ్- ఏపీలో పెట్టుబడి పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+