తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత

తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోలాహలం నెలకొంది. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.

మంగళవారం 67,267 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,629 మంది తలనీలాలను సమర్పించారు. టీటీడీకి హుండీ ద్వారా 2.58 కోట్ల రూపాయల ఆదాయం అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Another Leopard trapped at Tirumala, the number raised at 6

ఈ పరిస్థితుల్లో తిరుమలలో మరో చిరుత చిక్కింది. తిరుమల నడక దారిలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో టీటీడీ అటవీ విభాగం అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఈ తెల్లవారు జామున చిక్కింది. తిరుమల నడక దారిలో ఇప్పటివరకు చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది. ఈ చిరుతను శ్రీవేంకటేశ్వర జూపార్క్ కు తరలించనున్నారు. ఈ చిరుత వయస్సు నాలుగు సంవత్సరాలు ఉంటుందని అటవీ సిబ్బంది అంచనా వేశారు.

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బోనులో చిక్కిన చిరుతను పరిశీలించారు. చిరుతలను బంధించడానికి తాము అనుసరిస్తోన్న వ్యూహాలు ఫలిస్తోన్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఆరు చిరుతలను బంధించామని చెప్పారు. భక్తుల రక్షణ విషయంలో రాజీ పడబోమని పునరుద్ఘాటించారు.

తిరుమల నడక మార్గంలో లక్షితపై చిరుత దాడి చేసిన అనంతరం టీటీడీ అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ చిరుతను తెర మీదికి తెచ్చారు. వాటి సంచారాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టడానికి 500 చోట్ల సీసీ కెమెరాలను అమర్చారు. చిరుతలు విస్తృతంగా తిరుగాడే ప్రదేశాల్లో బోను ఏర్పాటు చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+