తిరుపతిలో బండి సంజయ ప్రచారం.. రెండురోజులు మకాం
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కాక రేపుతోంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగియగా.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన జనసేనాని పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు మీడియాకు తెలియజేశాయి.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనున్న సంగతి విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ దాఖలు చేశారు. ఇటు ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రచారం చేయనున్నారు. ఒకటి రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు.
బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున బండ సంజయ్ ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో కూడా బండి సంజయ్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఇండికేషన్ ఇచ్చారు. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా జరగబోతోంది. అదేరోజు తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. ఈ క్రమంలో రెండు చోట్ల గెలవాలని బీజేపీ అనుకుంటుంది.












Click it and Unblock the Notifications