Tirumala: చంద్రప్రభ వాహనంపై నర్తనకృష్ణుడు, శ్రీవారు, వెయ్యి కళ్లు చాలవు స్వామి, గోవిందా గోవిందా !
తిరుమల/ తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్రప్రభ వాహనం, సకలతాపహరం
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.చంద్రప్రభవాహనంపైస్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సోమవారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

నాదనీరాజనం
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి కె.రవిప్రభ బృందం మంగళధ్వని కార్యక్రమం జరిగింది. తిరుమల ఆస్థానమండపంలో తిరుపతికి చెందిన శ్రీమతి ప్రసన్నలక్ష్మి బృందం విష్ణుసహస్రనామ పారాయణం,

గురువాయర్ అప్పా
గురువాయూర్‌కు చెందిన శ్రీ మణికంధన్ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదనరావు బృందం అన్నమయ్య విన్నపాలు సంగీత కార్యక్రమం జరిగింది, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి కృష్ణకుమారి బృందం హరికథ పారాయణం చేశారు
-
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications