తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకాంత సేవలో జంట.. చైర్మన్‌తోపాటు హాజరు, బోర్డు సభ్యుడు కూడా.. వివాదం

|
Google Oneindia TeluguNews

తిరుమల శ్రీవారికి నిర్వహించే ప్రీతిపాత్రమైన సేవ ఏకాంత సేవ. ఏకాంతం అంటేనే ఇతరులు ఎవరూ లేకుండా స్వామికి చేసే సేవ. తమకు ఆప్తులైన వారిని వెంటబెట్టుకుని మరీ ఏకాంత సేవలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొంటున్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 4.30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు అభిషేక సేవ చేస్తారు. అన్ని సేవల్లో ఇది అత్యంత పవిత్రంగా భావిస్తారు.

తిరుమల కొండపై దుష్ప్రచారం: ఏకంగా రూ.100 కోట్లు: చంద్రబాబు కూడా కాపాడలేరు: బీజేపీ ఎంపీతిరుమల కొండపై దుష్ప్రచారం: ఏకంగా రూ.100 కోట్లు: చంద్రబాబు కూడా కాపాడలేరు: బీజేపీ ఎంపీ

 ఆర్జిత సేవతోపాటు అభిషేక సేవ కూడా..

ఆర్జిత సేవతోపాటు అభిషేక సేవ కూడా..

0/.,mnb

60- లాక్‌డౌన్‌ తరువాత అన్నీ ఆర్జిత సేవలతోపాటు అభిషేక సేవ కూడా ఏకాంత సేవగా మార్చారు. అర్చకులు మాత్రమే పాల్గొంటారు. ప్రభుత్వ ప్రతినిధులుగా వారం ఈవో దంపతులు, మరో వారం చైర్మన్‌ దంపతులు అభిషేక సేవలో పాల్గొంటున్నారు. తొలుత బోర్డు సభ్యులను అనుమతించలేదు. ఒకరిద్దరు బోర్డు సభ్యులు అనధికారికంగా సేవకు హాజరవడంపై వివాదం రేపింది. తర్వాత బోర్డు సభ్యులను మాత్రం పరిమితంగా టికెట్‌ మీద అనుమతించేలా నిబంధనలను సవరించారు.

 బయటివారికి మాత్రం నో

బయటివారికి మాత్రం నో

బయటి వారికి మాత్రం ఏకాంత సేవల్లో ప్రవేశం లేదు. తిరుపతిలో తనకు ఆతిథ్యం ఇచ్చే ఒక ఇంటి యజమాని దంపతులను వైవీ సుబ్బారెడ్డి గత శుక్రవారం అభిషేక సేవకు తీసుకువెళ్లారని తెలుస్తోంది. బోర్డు సభ్యుడు కూడా ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. వైవీ సుబ్బారెడ్డి ద్వారా స్వామి వారి ఏకాంత సేవలో పాల్గొన్న ఆ దంపతులు తిరుపతిలోని సంపన్న కాలనీలోని ఒక పెద్ద భవంతిలో ఉంటారని అంటున్నారు. సదరు యజమానికి పొరుగు దేశంలో భారీ వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి.

 గత చైర్మన్ కూడా బస

గత చైర్మన్ కూడా బస

గతంలో టీటీడీ చైర్మన్‌ ఒకరు తిరుపతికి వస్తే ఈయన ఇంటిలోనే ఉండేవారని తెలుస్తోంది. ప్రస్తుత చైర్మన్‌ కూడా తిరుపతిలో ఆయన ఆతిథ్యమే స్వీకరిస్తారని చెప్పుకొంటారు. టీటీడీలో పనిచేసిన ఒక అధికారితో ఆ యజమానికి ఉన్న స్నేహం గురించి కూడా పలు ప్రచారాలు ఉన్నాయి. చాలా మంది రాజకీయ ప్రముఖులకు ఆయన హెలికాప్టర్లు, స్పెషల్‌ విమానాలు ఏర్పాటు చేస్తుంటారని గుసగుసలు వినిపిస్తాయి. గతంలో ఆయన కోరినవన్నీ కొండమీద జరిగేవని అంటున్నారు. ఇప్పుడు అదే తీరులో ఏకంగా ఏకాంత సేవలో పాల్గొన్నారని చెబుతున్నారు. ఈ విషయం తెలిసినా భయంతో నోరు మెదపడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలతో ఆలయ మర్యాదలు మంటగలుపుతున్నారని స్వామి భక్తులు భగ్గుమంటున్నారు.

English summary
unknown couple involved along with ttd chairman for ekanta seva friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X