Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో స్వామిదర్శనానికి భక్తులు భారీగా తరలొచ్చారు. శుక్రవారం శ్రీవారి దర్శనానికి భక్తులు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని వారి సర్వదర్శనానికి 27 కంపార్టుమెంట్లలో భక్తులు నిలిచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.
గురువారం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు కూడా తిరుమలలో భక్తుల రద్ది కొనసాగే అవకాశం ఉంది. గురువారం స్వామివారిని 59,898 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

స్వామివారికి 26,936 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొంది. బుధవారం స్వామివారిని నిన్న 69,365 మంది భక్తులు దర్శించుకోగా 26,006 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో తాజాగా అద్దె టూవీలర్ సౌకర్యం అదుబాటులోకి వచ్చింది.
తిరుపతిలోని హాథీరాం ట్రావెల్స్ వారు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధాన రైల్వేస్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర బైకులను భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. 24 గంటల సమయానికి రూ.600 వసూలు చేస్తున్నారు. పెట్రోలు ఖర్చు భక్తులే భరించాల్సి ఉంటుంది. బైక్ అద్దె తీసుకోవాలంటే లైసెన్స్ తప్పకుండా ఉండాలి.












Click it and Unblock the Notifications