TTD: శ్రీవారి సేవకులుగా పని చేయాలనుకుంటే - ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు..!!
Tirumala: స్వచ్ఛంద సేవ అయిన శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కొరకు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆన్ లైన్ ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేసారు. సేవ కొరకు ఎవ్వరికి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని ఈవో వెల్లడించారు.
వారిని నమ్మవద్దు: శ్రీవారి సేవ ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయించడం జరుగుతుందని, ఎవరైనా డబ్బులు తీసుకుని సేవ తీసిస్తామంటే భక్తులు నమ్మవద్దని ఆయన చెప్పారు. సేవ సాప్ట్ వేర్ కచ్చితంగా ఉంటుందని, టీటీడీ సర్వర్ ను ఎవరు హ్యాక్ చేయలేరన్నారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా అమ్మ అని పిలవాలని ఈవో సూచించారు.

తిరుమలలో ఇయటివలే రూ.120 కోట్లతో 6 వేల గదులను ఆధునీకరించడం జరిగిందన్నారు. తిరుమల, తిరుపతిలో వసతి పొందేందుకు ఆన్లైన్ లో ఒకేసారి విడుదల చేస్తున్నామని చెప్పారు. శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఉచిత లడ్డు ఇవ్వాలని టిటిడి నిర్ణయించిందన్నారు. లడ్డు కౌంటర్ల వద్ద అదన లడ్డూలు కొనుగోలు చేయవచ్చని ఈవో సూచించారు.
చర్యలు తీసుకుంటాం: ప్రతిరోజు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నారని వివరించారు.. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి ఫ్రీ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు.
క్యూ లైన్ లలోని అత్యవసర గేట్ల ద్వారా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది బయటవారిని పంపుతున్నారని. అదేవిధంగా లడ్డు కౌంటర్ల వద్ద పక్కనుండి వచ్చి తీసుకు వెళుతున్నారని విషయం తన దృష్టికి వచ్చిందని..చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి వెల్లడించారు.
డిసెంబర్ లో విడుదల చేస్తాం: తిరుమలలో క్షురకులకు డబ్బులు ఇవ్వద్దని... ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశికి డిసెంబర్ లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లు విడుదల చేస్తామని ఈవో వెల్లడించారు.
సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వయసు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన ఉందని..పరిశీలన చేస్తామని ఈవో హమీ ఇచ్చారు. తిరుమలలో ధర్మ రథాలు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు వస్తుందన్నారు. బస్ స్టాప్స్ వద్ద ఆపుతారని ఈవో ధర్మారెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications