తిరుమల ఆస్థాన మండపంలో అగ్ని ప్రమాదం
తిరుపతి: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్థాన మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి.
నిరుపయోగంగా ఉన్న పరుపులు దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు తెలిపారు. ఆకతాయిలు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. ఏప్రిల్ 25న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి "శ్రీభాష్యం" పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్‌పత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications