భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గినట్లు అధికారులు పేర్కన్నారు. శ్రీవారి దర్శనం అతి తక్కువ సమయంలోనే అవుతుంది. ప్రస్తుతం దర్శనం కోసం భక్తుల్ని నేరుగా క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం దర్శనం త్వరగానే పూర్తవుతోంది. ప్రస్తుతం నేరుగా భక్తుల్ని శ్రీవారి దర్శనానికి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షల కాలం కావడం, ఎండలు విపరీతంగా ఉండడంతో భక్తుల రద్దీ తగ్గి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వారాంతం నుంచి రద్దీ మళ్లీ పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో ఈ వీకెండ్‌లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కూడా ముగిశాయి. తిరుమల తగ్గిన రద్దీ దృష్ట్యా ఎస్ఎస్‌డి దర్వనానికి మొత్తం నాలుగు గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు ఆరు గంటల్లో దర్శనం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇక, ఒక్క మంగళవారం నాడే తిరుమల శ్రీవారిని మొత్తం 60,371 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న మొక్కుల కారణంగా శ్రీవారికి హుండీకి రూ.3.09 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే 20,301 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

గరుడుసేవను రద్దు చేసిన టీటీడీ...
తిరుమల శ్రీవారి ఆలయంలోని వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం నాటికి ముగిశాయి. మొదటిరోజు, రెండో రోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఆఖరు రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వసంతోత్సాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications