తిరుమల శ్రీవారి భక్తులకు ఎన్నాళ్లకు శుభవార్తో?

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతికతతో మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నామన్నారు ఈవో.

తిరుమలకు కొండపై నడుచుకుంటూ వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండటం లేదని గుర్తించామని, అందుకే ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అది పూర్తవగానే టోకెన్ల జారీని ప్రారంభిస్తామని, దివ్యదర్శనం టోకెన్ల జారీపై సర్వే నిర్వహించి.. విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు.

లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు

లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతికతతో మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందిస్తున్నామన్నారు. తిరుమలలో గదుల అందుబాటును బట్టి వృద్ధులు, దివ్యాంగులకు క్రింది అంతస్తుల్లోనే గదులు కేటాయిస్తున్నాన్నారు. ఆధార్‌ ద్వారానే ఆర్జిత సేవా టికెట్లు పొందేలా ఏర్పాటు చేస్తామని, ప్రతిరోజు లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందేందుకు ముందు రోజు తిరుమలలో పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

కాళ్లు కాలకుండా వైట్ పెయింట్

కాళ్లు కాలకుండా వైట్ పెయింట్

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అనధికారికంగా స్నాక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ అమ్ముతున్న కొందరిని అరెస్ట్‌ చేయడం జరిగింది. ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగు మాడ వీధుల్లో ఎండ కారణంగా భక్తులకు కాళ్లు కాలకుండా వైట్‌ పెయింట్‌, మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం వల్ల అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోందని, భక్తుల విజ్ఞప్తి మేరకే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు జలప్రసాద కేంద్రాల్లో నీటిని పరీక్షిస్తామని, డ్యామ్‌లోని నీటిని కూడా పరీక్షించిన తరువాతే సరఫరా చేస్తున్నామన్నారు.

గదుల కేటాయింపు కేంద్రాల వద్ద త్వరలో తక్కువ ధరకు భక్తులకు టప్పర్‌ వేర్‌, రాగి బాటిళ్ళను అందుబాటులో ఉంచుతామని, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కాషన్‌ డిపాజిట్‌ చెల్లించి ఉంటే మూడు రోజులలో అదే అకౌంట్‌కి డబ్బులు జమవుతాయని తెలిపారు.

శ్రీవాణి భక్తులకు 88 గదులు

శ్రీవాణి భక్తులకు 88 గదులు

శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన వారికి తిరుమలలోని ఎస్‌ఎన్‌జీహెచ్‌, ఏటీజీహెచ్‌ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయిస్తామని, శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో నెలలో రెండు గుండెమార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఏప్రిల్‌ మొదటి వారానికి తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని.. వీటిని ధర్మరథం బస్సుల స్థానంలో ఉపయోగిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+