తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం...
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుపతి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి మరోసారి భారీ ఆదాయం సమకూరింది. కేవలం ఒక్కరోజులోనే సరికొత్త రికార్డు నమోదయ్యిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఒక్క సోమవారం నాడే తిరుమల శ్రీవారి హుండీకి రూ.5.48 కోట్లు ఆదాయం వచ్చింది. సోమవారం రోజే మొత్తం 69,314మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అందులో ఒక్కరోజే 25,165మంది భక్తులు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి వారి మొక్కులను చెల్లించుకోవడం జరిగింది.
తిరుమల శ్రీవారి కొండపై నిత్యం రద్దీ కొనసాగుతూ ఉంటుంది. ఎల్లప్పడూ తిరుపతి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మొత్తం 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఇక, టైమ్ స్లాట్ టికెట్ లేని సర్వ దర్శనానికయితే సుమారు పన్నెండు గంటల సమయం పడుతోంది. ఫిబ్రవరి 16వ తేదిన తిరుమల శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో రథసప్తమి పండుగను ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఈ రథసప్తమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఆ అద్భుత దృశ్యాలను చూసేందుకు భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఆ రోజున ఆలయంలో ఉదయం ఏడు నుంచే సూర్యప్రభవాహనం, రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు.

ఈ నెల 16న రథసప్తమి ఉత్సవాలతో పాటు మార్చి 1 నుంచి పదో తేది వరకు తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు తిరిగి రాత్రి ఏడు నుండి 9 గంటల వరకు వాహనసేవలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 1వ తేదని ఉదయం ధ్వజారోహణం రాత్రి - హంస వాహనం ఉంటుంది. ఇక, మార్చి 2 వతేదిన ఉదయం - సూర్యప్రభ వాహనం రాత్రి - చంద్రప్రభ వాహనం కార్యక్రమం ఉంటుంది. మార్చి 3వ తేదిన ఉదయం - భూత వాహనం, రాత్రి - సింహ వాహనం ఉంటుంది మార్చి 4 వతేదిన ఉదయం - మకర వాహనం, రాత్రి - శేష వాహనం ఉంటుంది. మార్చి 5 వతేదిన ఉదయం - తిరుచ్చి ఉత్సవం, రాత్రి - అధికారనంది వాహనం, మార్చి 6 న ఉదయం - వ్యాఘ్ర వాహనం, రాత్రి - గజ వాహనం, మార్చి 7న ఉదయం - కల్పవృక్ష వాహనం, రాత్రి - అశ్వ వాహనం ఉంటుంది. మార్చి 8వ తేదిన ఉదయం - రథోత్సవం (భోగితేరు) రాత్రి - నందివాహనం, మార్చి 9న ఉదయం - పురుషామృగవాహనం సాయంత్రం - కల్యాణోత్సవం,రాత్రి - తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి పదో తేదిన ఉదయం - త్రిశూలస్నానం సాయంత్రం - ధ్వజావరోహణం, రాత్రి - రావణాసుర వాహనం ఉంటుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications