Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. స్వామివారి దర్శనానికి 7 గంటల సమయం..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు స్వామివారి దర్శనానికి 15 కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టికెట్ లేని సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పడుతుంది. మంగళవారం 64,214 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 25,777 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. స్వామి వారిని సోమవారం 68,263 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 28,355 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో పవిత్రోత్సవాలు సాగుతోన్నాయి.

నేడు పవిత్రాది వాసం, రేపు పవిత్రావరోహణ కొనసాగుతోన్నాయి. సెప్టెంబర్‌ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి. తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా చేసి నష్టాలను భరించే ప్రసక్తే లేదని కర్ణాటక పాల మహామండలి అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు. టీటీడీ తయారు చేస్తున్న లడ్డూలకు నందిని నెయ్యి సరఫరా చేస్తే నష్టాలు వస్తాయని బీమా నాయక్ చెబుతున్నారు. కాగా మంగళవారం తిరుమల స్వామి వారికి హీరో మోటో కార్ప్ సంస్థ గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని అందజేసింది.

It takes 7 hours to visit Srivaru in Tirumala

ఆలయం వద్ద ఈ వాహనానికి పూజరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైక్ తాళాలను తిరుమల డిఐ జానకీరామ్ రెడ్డికి అందజేశారు. వాహనం ధర రూ.97,000 వేలని కంపెనీ పేర్కొంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వా దేవాలంయలో సెప్టెంబ్ర 7న గోకులాష్టమి నిర్వహించనున్నారు. మురళిలోలుడికి అభిషేకం, అర్చన నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలకు కాలి నడక వెళ్లే భక్తులు ధైర్యంగా వెళ్తున్నారు.

నడక మార్గంలో సంచారించే నాలుగు చిరుత పులులను అటవీ శాఖ అధికారులు బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికి ప్రస్తుతం టీటీడీ నిబంధనలు కొనసాగుతోన్నాయి. కొద్ది రోజుల క్రితం రక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసిన చంపిన విషయం తెలిసిందే. దీంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+