Tirumala: గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు..

కలియువైకుంఠం తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం సాయంత్రం శ్రీవారికి గరుడ వాహన సేవ నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై మాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం సాయంత్రం ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల చుట్టూ ఉన్న 221 గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. పురాణాల ప్రకారం మహావిష్ణువు (శ్రీ వేంకటేశ్వర) గరుడ ఇష్టమైన రథసారధిగా ఉన్నాడు. గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదమని నమ్ముతుంటారు. దర్శనం చేసుకుంటే భక్తులందరి కోరికలను తీరుస్తుందని బలంగా నమ్ముతారు.

ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచి ఉన్న భక్తులను కూడా నలుమూలల్లో క్యూలు కట్టి దర్శనానికి అనుమతించారు. గరుడ వాహన సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది.

Lord Venkateswara of Tirumala visited the devotees on the Garuda Vahanam on Thursday evening

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద‌జీయ‌ర్‌స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో ఉదయం స్వామి వారు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడని... గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులని నమ్ముతారు. 20వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి పుష్పకవిమానంపై విహ‌స్తారు. పుష్ప‌క విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+