వీడియో: తిరుమలలో నూతన గవర్నర్!
తిరుమల: రాష్ట్ర నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా పాలనా యంత్రాంగం సాదరంగా ఆహ్వనించింది.
అనంతరం ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, స్వాగతం పలికారు. పద్మావతి అతిథిగృహంలో గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకుంటున్నారు.

సాయంత్రం గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం ఆయన విజయవాడకు బయలుదేరి వెళతారు. విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శిస్తారు. బుధవారం ఆయన రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే- విజయవాడ బందరు రోడ్డులో ఉన్న నీటిపారుదల శాఖ భవన సముదాయాన్ని రాజ్‌భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విశ్వభూషణ్ హరిచందన్‌తో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.












Click it and Unblock the Notifications