తిరుమల బ్రహ్మోత్సవాలు, గజవాహనంపై శ్రీమలయప్పస్వామి కటాక్షం, పుష్ప‌క విమానంలో !

తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్షదైవం కొలువుతీరిన తిరుమలలోని (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) ఆరో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన (devotees)బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

తిరుమలకు (Tirumala)విశేషంగా విచ్చేసిన భక్తులు (devotees) అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.గజ వాహనం అంటే క‌ర్మ విముక్తి అని పురాణాలు చెబుతున్నాయి. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఆచారంలో ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

Srimalayappa Swamis comment on Gajavahanam in Tirumala Brahmotsavam

తిరుమలలో (Tirumala) శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా ఆరవ రోజైన శుక్ర‌వారం సాయంత్రం 4 గంట‌లకు గోవర్ధనగిరిధారి అయిన రుక్మిణి స‌త్య‌భామ స‌మేత శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు పుష్ప‌క విమానంలో అభ‌య‌మిచ్చారు.

పుష్ప‌క విమానం సేవ‌ను మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు.

వాహనసేవల్లో (brahmotsavam)అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచేపు చేస్తారు.

ఈ ప్రత్యేకమైన పుష్ప‌క విమానాన్ని కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 27 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడ‌వు, 14 అడుగుల వెడల్పుతో దాదాపు ఒక ట‌న్ను బ‌రువు ఉంటుంది. ఇందులో 6 రకాల సాంప్రదాయ పుష్పాలు ఉప‌యోగించారు. శ్రీ‌వారి పుష్ప‌క విమానాన్ని మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేశారు.

Srimalayappa Swamis comment on Gajavahanam in Tirumala Brahmotsavam

విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ గ‌రుత్మంతుడు, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ప్ర‌భావ‌ళితో కూడిన అష్ట‌నాగులు, మూడ‌వ ద‌శ‌లో తిరునామాలు, గోపురంతో రూపొందించారు. తమిళనాడులోని (tamil nadu) సేలానికి చెందిన 20 మంది, టీటీడీ గార్డెన్ విభాగానికి చెందిన 10 మంది వారం రోజుల ‌పాటు శ్ర‌మించి ఈ అద్భుతమైన విమానాన్ని సిద్ధం చేశార‌ని టీటీడీ గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ‌నివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత శ్రీ రాంప్ర‌సాద్ భ‌ట్‌ శ్రీవారి పుష్ప‌క విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహ‌కారాన్ని అందించారు.

Srimalayappa Swamis comment on Gajavahanam in Tirumala Brahmotsavam

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ..ధ‌ర్మారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, పలువురు టీటీడీ (TTD) బోర్డు సభ్యులు జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ ఇత‌ర టీటీడీ (TTD) అధికారులు పాల్గొన్నారు. తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు (brahmotsavam) బారులుతీరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+