శ్రీవారిని దర్శించిన హీరో విశాల్: ఇంటి కోసం దాచుకున్న డబ్బు పునీత్ కలలను నెరవేర్చడానికి
తిరుపతి: తమిళ హీరో విశాల్.. ఈ తెల్లవారు జామున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్‌కే రోజా, ఇతర ప్రముఖులతో కలిసి శ్రీవారిని దర్శించారు. విశాల్ హీరోగా నటించిన ఎనిమి మూవీ దీపావళి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఆర్య ఇందులో కీలక పాత్రను పోషించారు. ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం విశాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

కాలినడకన తిరుమలకు..
ఈ సందర్భంగా తిరుమలేశుడిని దర్శించుకున్నారు. దీనికోసం ఆయన మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు వచ్చారు విశాల్. రాత్రి పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రోజా.. ఒకరిద్దరరు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కుటుంబ సభ్యుడిని కోల్పోయా..
అనంతరం విశాల్.. ఆలయం వెలుపల కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల స్పందించారు. ఆయన మరణం తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ను తాను కలిశానని, కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. ఆయన కన్నుమూయడం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.

పునీత్ లెగాసీని కొనసాగిస్తా..
పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని విశాల్ చెప్పారు. ఇంటిని కొనడానికి దాచి పెట్టుకున్న డబ్బును దీనికోసం ఖర్చు చేస్తానని అన్నారు. ఇళ్లు ఎప్పుడైనా కొనవచ్చని, పునీత్ లెగాసీని కొనసాగించడం అవసరమని పేర్కొన్నారు. ఆయన కన్నుమూసి, ఇన్ని రోజులైనా ఇంకా గుండెల్లో ఉన్నాడని, గుర్తుకొస్తున్నాడని విశాల్ చెప్పారు. పునీత్ మొదలు పెట్టిన సామాజిక కార్యక్రమాలు ఎక్కడా ఆగకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు.

ఇంటి కోసం దాచుకున్న డబ్బు..
ఆయన పోషిస్తోన్న అనాథ పిల్లలు చదువుకోవాలి, వారికి మెరుగైన జీవితాన్ని కల్పించాలని కోరుకున్నానని చెప్పారు. దీనికి అవసరమైన ఖర్చును తాను సొంతంగా భరిస్తానని విశాల్ స్పష్టం చేశారు. ఇళ్లు కొనుక్కోవాలని తాను డబ్బులు దాచి పెట్టుకున్నానని, అది వచ్చే సంవత్సరమైనా కొనుక్కోవచ్చని చెప్పారు. ఆ డబ్బును ఆ పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని అన్నారు. పునీత్ ఎన్నో మంచి పనులు చేపట్టారని, అందులో ఒకటి- అనాథ పిల్లలకు చదువును చెప్పించడం.. ఆ బాధ్యతను తాను తీసుకున్నానని అన్నారు.

విశాల్-ఆర్య కాంబో..
విశాల్, ఆర్య కాంబినేషన్‌లో వస్తోన్న మరో సినిమా ఎనిమి. ఇదివరకు వారిద్దరూ కలిసి వాడు వీడు సినిమాలో నటించారు. బాలా దర్శకుడు. సుదీర్ఘ విరామం తరువాత వారిద్దరూ స్క్రీన్‌పై కనిపించనుండటం అంచనాలను పెంచింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిని స్టూడియోస్ బ్యానర్ కింద వినోద్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

తిరుమలలో భారీ వర్షం..
తిరుమలలో ఈ తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. భక్తులు కొంత ఇబ్బందులకు గరయ్యారు. ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షం వల్ల చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది. కొద్దిరోజులుగా తిరుమలలో అడపాదడపా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండిపోయాయి. తిరుమలకు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ప్రాజెక్టులు అవి.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications