Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. నిండిపోయిన 31 కంపార్టుమెంట్లు..
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. కొద్ది రోజుల్లో పాఠశాలలు, కాలేజీల సెలవులు ముగుస్తుండడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల దూరం క్యూలైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉంది.
క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రాకను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవలను రద్దు చేస్తు న్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు. ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు విలువచేసే స్థలాన్ని టిటిడికి మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.
రూ. 100 కోట్ల వ్యయంతో రేమాండ్స్ అధినేత సింఘానియా ఆలయాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. అలాగే టీటీడీ పద్మావతి హృదయాలయంలో ఇప్పటి వరకు 1450 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించామని తెలిపారు. ఆదివారం శ్రీవారిని 87,434 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,957 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
మే నెలలో 23.38 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా రూ.109.99 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. మేలో 1కోటి 6 లక్షల శ్రీవారి లడ్డూలను కొనుగోలు చేశారు. మేలో56.30 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.11 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications