Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటల సమయం..!
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శని, ఆది, సోమవారం సెలువులు రావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు. శనివారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. రూ.300 స్పెషల్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, నీరు పంపిణీ చేస్తోంది. తిరుమలలో గురువారం నుంచి యాత్రికుల తాకిడి కొనసాగుతోంది. సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. శుక్రవారం రోజున స్వామి వారిని 66 వేల 782 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లుగా ఉంది.

ఎస్‌ఈ2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, వాటర్ వర్క్స్ ఈఈ శ్రీశ్రీహరి, చీఫ్ పీఆర్‌వో డాక్టర్ టి.రవి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవో అన్నప్రసాదం శ్రీ రాజేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఏవిఎస్‌వో శ్రీ సత్యసాయి గిరిధర్ తదితరులు రాద్దీ మొదలైనప్పటి నుండి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారని ప్రకటించింది. ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications