Tirumala: క్షమాపణలు చెప్పిన యూట్యూబర్..

కలియుగ వైకుంఠ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెకిలి చేష్టలు చేసిన యూట్యూబర్ క్షమాపణలు చెప్పాడు. క్యూలైన్‌లో ప్రాంక్‌ వీడియోలు తీసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తమిళనాడుకు చెందిన టీటీఎఫ్‌ వాసన్‌ క్షమాపణలు చెబుతూ శనివారం వీడియో విడుదల చేశాడు. తాము కూడా శ్రీవారి భక్తులమేనని చెప్పాడు. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేసినట్లు చెప్పాడు. కానీ తోటి మిత్రుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలను దెబ్బతీశాయని అతను పేర్కొన్నాడు.

తాము అలా చేసినందుకుమనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వీడియోలో తెలిపాడు. ఇకపై అలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపాడు. ఇదే వీడియోపై తితిదే విజిలెన్స్‌ విభాగం తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

The YouTuber who shot Prank s video in Tirumala apologized and released the video

ఈ కారణంగా జూలై 15వ తేదీ సిఫారసు లేఖలు తీసుకోమని.. దయచేసి భక్తులు అర్థం చేసుకోవాలని టీటీడీ కోరింది. దేశ విదేశాల నుంచి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు), ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ పలు మార్పులు చేసే అవకాశం ఉంది.

గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+