ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు - ఎప్పుడెప్పుడు, ప్రత్యేకత..!!
Tirumala: ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్ కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగానే నిర్వహించింది.
ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా తిరుమల తిరుపతిలో సాలకట్ల బ్రహ్మోత్సవం (సాలకట్ల అంటే వార్షికం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవం (వార్షిక బ్రహ్మోత్సవం) 18 సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ 2023 జరగనున్నాయి. అదే విధంగా నవరాత్రి బ్రహ్మోత్సవం 15 అక్టోబర్ 2023 23 అక్టోబర్ 2023 వరకు జరగనున్నాయి.

దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను టీటీడీ ప్రకటించింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 17 సెప్టెంబర్ 2023 - ఆదివారం - అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన ఉంటాయి. 18 సెప్టెంబర్ 2023 - ద్వజారోహణ (ధ్వజారోహణం) , 19 సెప్టెంబర్ 2023 - మంగళవారం ఉదయం చిన శేష వాహనం, రాత్రి 7-9 గంటల వకు హంస వాహనం పైన ఊరేగింపు ఉంటాయి.
20 సెప్టెంబర్ 2023 - ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యాల పందిరి వాహనం పైన శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21 సెప్టెంబర్ 2023 - గురువారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వ భూపాల వాహనం పైన శ్రీవారు మాడవీధుల్లో ఊరేగింపు ఉండనుంది. 22 సెప్టెంబర్ 2023 - శుక్రవారం శ్రీవారు మోహిని అవతారం, సాయంత్రం గరుడ వానహం పైన దర్శనం ఇవ్వనున్నారు.

23 సెప్టెంబర్ 2023 - శనివారం హనుమంత వాహనం, సాయత్రం గజ వాహనం పైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 24 సెప్టెంబర్ 2023న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం పై నుంచి భక్తుల మధ్యకు రానున్నారు. 25 సెప్టెంబర్ 2023 రధోత్సవం, సాయంత్రం అశ్వవాహనం ఊరేగింపు ఉండనుందది. 26 సెప్టెంబర్ 2023 పల్లకీ ఉత్సవం, చక్ర స్నానం, సాయంత్రం ధ్వజారోహనతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 14న అంకురార్పణ జరగనుంది. 15 అక్టోబర్ 2023న బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రికి శ్రీవారు పెద శేష వాహనం పైన విహరించనున్నారు. 16 అక్టోబర్ 2023న ఉదయం చిన శేష వాహనం, రాత్రికి హంస వాహనం పైన శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 17 అక్టోబర్ 2023 సింహ వాహనం, అదే రోజు రాత్రికి ముత్యాల పల్లకి వాహనం పైన శ్రీవారు మాడ వీధుల్లో విహరిస్తారు.

18 అక్టోబర్ 2023న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం పైన శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. 19 అక్టోబర్ 2023 మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహనం పైన శ్రీవారి ఊరేగింపు ఉంటుంది. 20 అక్టోబర్ 2023 హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రికి గజ వాహనం నుంచి శ్రీవారు భక్తులకు దర్శనం ఉండనుంది.
21 అక్టోబర్ 2023 సూర్యప్రభ వాహనం నుంచి శ్రీవరు దర్శనం ఇవ్వనున్నారు. 22 అక్టోబర్ 2023న ఉదయం స్వర్ణ రధోత్సవం నిర్శమించనున్నారు. అదే రోజు సాయంత్రం అశ్వ వాహనం ఊరేగింపు ఉండనుంది. 23వ తేదీన ఉదయం చక్రస్నానం, సాయంత్రం కార్యక్రమాల్లో బ్రహోత్మవాలు ముగియనున్నాయి.












Click it and Unblock the Notifications