Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతి బై పోల్ : హోదా వద్దన్న చంద్రబాబు, దొంగ ఓట్ల జగన్ సర్కార్ .. సోము వీర్రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి. అధికార పార్టీ చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయం సాధించాలని భావిస్తుండగా, చంద్రబాబు జగన్ పాలనలో వైఫల్యాలను , అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే బిజెపి కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది. అటు టిడిపిని, ఇటు వైసీపీ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

 హోదా వద్దన్నది చంద్రబాబే ... దగ్గరుండి మరీ ప్యాకేజీలు తీసుకున్నారని విమర్శలు

హోదా వద్దన్నది చంద్రబాబే ... దగ్గరుండి మరీ ప్యాకేజీలు తీసుకున్నారని విమర్శలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రధాన అంశాలపై బిజెపి అధికార, ప్రతిపక్ష పార్టీల పై మాటల దాడిని పెంచింది. తిరుపతి వేదికగా ఎన్నికల సన్నాహక కార్యక్రమాలలో పాల్గొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు దగ్గరుండి మరీ ప్యాకేజీ తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు టిడిపి ఎంపీలు పార్లమెంట్లో హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

రెండు లక్షల దొంగ ఓట్లు వెయ్యటానికి ఆధార్ కార్డుల తయారీ .. వైసీపీ సర్కార్ టార్గెట్

రెండు లక్షల దొంగ ఓట్లు వెయ్యటానికి ఆధార్ కార్డుల తయారీ .. వైసీపీ సర్కార్ టార్గెట్

ఇదే సమయంలో అధికార పార్టీ తీరుపై విమర్శల వర్షం కురిపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటికే రెండు లక్షల దొంగ ఓట్లు వేసేందుకు ఆధార్ కార్డులు తయారు చేసినట్లుగా ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి అరాచకాలు చేసే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందని, అధికార పార్టీ తీరు గర్హనీయమని విమర్శించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపిని గెలిపించండి పోయినా, ఎప్పుడు బిజెపి రాష్ట్రం పై చిన్నచూపు చూపలేదని పేర్కొన్న సోము వీర్రాజు, రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే యత్నం చేస్తున్న బీజేపీ నేతలు

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే యత్నం చేస్తున్న బీజేపీ నేతలు

కేంద్ర ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి దాకా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించిన బీజేపీ, తాజా పరిణామాల నేపథ్యంలో హిందుత్వ అజెండా పక్కనపెట్టి అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో టీడీపీపై కూడా విమర్శనాస్త్రాలు కురిపిస్తుంది . తిరుపతి ఉప ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోవడం కోసం బిజెపి సైతం బరిలోకి దిగి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక అభ్యర్థి ఎంపికపై కూడా


పడరాని పాట్లు పడుతుంది .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+