తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలో ఊహించని ఫలితం- జడ్జీల దయతో సీఎంగా జగన్‌- చింతామోహన్ షాకింగ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో తిరుపతి ఉపఎన్నిక రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తిరుపతి గురించిన చర్చే జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై ఓ చర్చ అయితే ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరో ఎత్తుగా మారిపోయాయి. అందులోనూ ప్రధాన పార్టీలను మించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ చేస్తున్న కామెంట్లు అయితే దారుణంగా పేలుతున్నాయి. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన కొన్ని రోజులుగా వరుసగా బాంబులు పేలుస్తున్నారు. ఇవాళ కూడా జగన్‌, మోడీని ఉద్దేశించి చింతా మోహన్‌ చేసిన విమర్శలు కలకలం రేపాయి.

జగన్‌ మరో ప్రయోగం-తిరుపతి ఓటర్లకు లేఖ- వైసీపీకే ఎందుకు ఓటేయాలంటే..జగన్‌ మరో ప్రయోగం-తిరుపతి ఓటర్లకు లేఖ- వైసీపీకే ఎందుకు ఓటేయాలంటే..

తిరుపతిలో చెలరేగుతున్న చింతా మోహన్‌

తిరుపతిలో చెలరేగుతున్న చింతా మోహన్‌

తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగిన చింతా మోహన్‌కు ఇవి వరుసగా పదో లోక్‌సభ ఎన్నికలు. ఇప్పటివరకూ తొమ్మిదిసార్లు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా తిరుపతి బరిలోకి దిగి ఆరుసార్లు గెలిచిన చింతా మోహన్ యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరపున మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న చింతామోహన్‌కు తిరుపతిలో గడ్డు పరిస్దితులు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన ప్రత్యర్దులపై మరీ ముఖ్యంగా సీఎం జగన్‌పై విమర్శలతో చెలరేగిపోతున్నారు.

 తిరుపతిలో ఊహించని ఫలితం ?

తిరుపతిలో ఊహించని ఫలితం ?

ఇవాళ తిరుపతి లోక్‌సభ స్ధానం పరిధిలోకి వచ్చే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రచారం నిర్వహించిన చింతా మోహన్.. తిరుపతిలో ఏం జరగబోతోందో చెప్పేశారు. తిరుపతిలో జరుగుతున్న ఉపఎన్నిక వైపు దేశంలో 130 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని చింతా తెలిపారు.
తిరుపతి ఉపఎన్నికలో ఎవరూ ఊహించని ఫలితం రాబోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తిరుపతిలో వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్దుల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో అసలు పోటీలో ఉన్నా లేనట్లుగా ఉన్న చింతామోహన్‌ ఊహించని ఫలితం రాబోతోందని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.

 జడ్జీల దయతో సీఎంగా జగన్‌

జడ్జీల దయతో సీఎంగా జగన్‌

ముఖ్యమంత్రి జగన్ న్యాయమూర్తుల దయతోనే ఆ పదవిలో కొనసాగుతున్నారని చింతా మోహన్‌ మరో బాంబు పేల్చారు. అదెలాగో మాత్రం ఆయన చెప్పలేదు. ఇప్పటికే పలు సీబీఐ కేసుల్ని ఎదుర్కొంటూ, తాజాగా సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణపై సుప్రీంకోర్టు ప్రస్తుత సీజేకు లేఖ రాసిన జగన్‌.. న్యాయమూర్తుల దయతో పదవిలో కొనసాగుతున్నట్లు చింతా మోహన్‌ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయా కేసుల్లో న్యాయమూర్తులు జగన్‌ను వదిలేయడం వల్లే సీఎంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది.

99 తప్పులు చేసేసిన జగన్

99 తప్పులు చేసేసిన జగన్

సీఎం జగన్‌ వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికే 99 తప్పులు చేసేశారని తిరుపతి ఉపఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్ది చింతా మోహన్ ఆరోపించారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో ఓట్లు కొనేందుకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన జగన్.. ఇప్పుడు బిలియనీర్ అయ్యారంటూ చింతామోహన్ మరో ఆరోపణ కూడా చేశారు. గతంలో చంద్రబాబు వైఎస్‌ కుటుంబంపై ఇవే ఆరోపణలు చేసేవారు. జగన్‌ తాత రాజారెడ్డి హయాంలో సామాన్య కుటుంబంగా ఉన్న వైఎస్సార్‌ ఫ్యామిలీ వైఎస్‌ సీఎం అయ్యాక కోట్లు సంపాదించినట్లు చంద్రబాబు ఆరోపించేవారు. ఇప్పుడు చింతా మోహన్ కూడా దాదాపు అవే ఆరోపణలు చేశారు.

మోడీ గడ్డం వెనుక కథ

మోడీ గడ్డం వెనుక కథ

తిరుపతి ఉపఎన్నికలో ప్రధాన పార్టీలకు పోటీ నిస్తున్న బీజేపీపైనా చింతామోహన్ విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం 60, 70 ఏళ్ల తర్వాత నిన్న ఎరువుల ధరలు భారీగా పెంచిందన్నారు. ప్రధాని మోడీ ఎక్కువ కాలం పదవిలో ఉండరని, అందుకే గడ్డం పెంచుతున్నారని చింతా మోహన్‌ విచిత్రమైన లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే జగన్‌ సీఎంగా ఎక్కువ కాలం ఉండరని ఆరోపణలు చేస్తున్న చింతా మోహన్‌.. ఇప్పుడు మోడీ కూడా ఎక్కువకాలం పదవిలో ఉండరని వ్యాఖ్యానించడంపైనా చర్చ జరుగుతోంది.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Oneindia Telugu

English summary
congress party contestant in tirupati byelection chinata mohan again made sensational comments on cm ys jagan and pm modi in his poll campaign today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X