Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirupati: శ్రీవారి భక్తులకు శుభవార్త, రేపే ఉ. 9 గంటలకు విడుదల, ఐనా మహల్ ప్రతిరోజు ఉంజల్ సేవ !

తిరుమల/ తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం వచ్చింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ లో రూ. 300 టిక్కెట్లు విడుదల చేస్తున్నారు. ఆగస్టు 24వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో సెప్టెంబర్ నెల కోటాకు చెందిన రూ. 300 టిక్కెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న స్వామివారి భక్తులు మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో రూ. 300 టిక్కెట్లు రిజర్వు చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్బంగా తిరుమలలో వైభవంగా గురుడసేవ జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడుని అధిరోహించి వాహన మండపంలోనే భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమతిలోని శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్ లో ఇక ముందు ప్రతిరోజూ స్వామివారి ఉంజల్ సేవ జరుగుతుందని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్. జవర్ రెడ్డి అన్నారు.

తిరుమలలో గరుడసేవ

తిరుమలలో గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కుంభవృష్టి కారణంగా వాహన మండపంలో పౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రావ‌ణ పౌర్ణ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడుని అధిరోహించి వాహన మండపంలోనే భక్తులకు దర్శనమిచ్చారు.

సర్వపాప ప్రాయశ్చిత్తం

సర్వపాప ప్రాయశ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు

ఐనా మహల్ ప్రారంభం

ఐనా మహల్ ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో రూ. 66 లక్షలతో ఆధునీక‌రించిన ఐనా మ‌హ‌ల్‌ను ఆదివారం రాత్రి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు.

శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఐనా మహల్ లో సాయంత్రం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, పుండరీక వల్లి అమ్మవారి ఉత్స‌వ‌ర్ల‌కు ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించారు. ఐనా మహల్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ప్రతిరోజూ స్వామివారి ఉంజల్ సేవ

ప్రతిరోజూ స్వామివారి ఉంజల్ సేవ

తిరుమతిలోని శ్రీ గోవింద రాజాస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్ ను శ్రావణ పౌర్ణమి పుణ్యదినం సందర్భంగా పునఃప్రారంభించామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 ఏళ్ళ కిందట నిర్మించిన ఐనా మహల్ ను ఆధునీకరించి పునః ప్రారంభించామన్నారు. ఇక మీదట ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి మీడియాకు చెప్పారు.

పెద్దజీయర్ స్వామి, టీటీడీ ఈవో, జెఈవో

పెద్దజీయర్ స్వామి, టీటీడీ ఈవో, జెఈవో


తిరుపతి శ్రీగోవిందస్వామి ఆలయంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, జెఈవో శ్రీమతి సదా భార్గవి,
ఎఫ్ఏసిఎ వో బాలాజి, ఎస్ఈ ఎలక్ట్రికల్
వెంకటేశ్వర్లు, ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో
రాజేంద్రుడు, డెప్యూటీ ఈవోలు గోవిందరాజులు,
రమణ ప్రసాద్, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో
ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ కామ‌రాజు తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+