TTD: తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలతో పాటు మార్చినెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు!!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో ప్రతీ నెల విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. టీటీడీ ఆ క్యాలెండర్ ముందే రిలీజ్ చేస్తుంది. మార్చి నెలకు సంబంధించిన విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారికి మార్చి నెలలో 20 నుంచి 24వ తేదీ వరకు తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు, ఇతర కార్యక్రమాల వివరాల్లోకి టిటిడి ఆధ్వర్యంలో మార్చి నెలలో మార్చి మూడవ తేదీన పల్స్ పోలియో నిర్వహించనున్నారు. మార్చి ఆరవ తేదీన సర్వ ఏకాదశిని, మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా చేయడానికి టిటిడి నిర్ణయించింది.

మార్చి 25వ తేదీన తుంబురు తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు. అదే రోజు శ్రీ లక్ష్మీ జయంతిని కూడా నిర్వహించనున్నారు. ఇక మార్చి నెలలో శ్రీవారి తెప్పోత్సవాలు అత్యంత ముఖ్యమైన విశేషమైన రోజులుగా చెప్పవచ్చు. ఇక శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి అవతారంలో శ్రీవారు తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తారు.
రెండో రోజు రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి అవతారం లోను భక్తులను కటాక్షిస్తారు. ఆ తర్వాత మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి గా స్వామి పుష్కరిణిలో విహరిస్తారు. స్వామివారి వార్షిక తెప్పోత్సవం ప్రతీ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకునే యాత్రికుల సంఖ్య 70,077గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,427గా ఉంది. ఇక స్వామివారికి వచ్చిన హుండీ ఆదాయం 3.73 కోట్లు కాగా, మొత్తం 12 వెయిటింగ్ కంపార్ట్మెంట్లలో స్వామి దర్శనానికి భక్తులు నిన్న వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం ప్రస్తుతం ఎనిమిది గంటల సమయం పడుతుంది.












Click it and Unblock the Notifications