TTD: అమ్మవారి కళ్యాణోత్సవంలో వర్చువల్ గా పాల్గొనే అవకాశం- నేటి నుంచే..!!
Tirumala: తిరుమల నడక మార్గంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నారిపై చిరుత దాడి తరువాత భద్రతా పరంగా టీటీడీ పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. అదే సమయంలో దివ్య దర్శనం విధానంలో మార్పులు చేసారు. దీంతో రోడ్డు మార్గంలో వెళ్లే భక్తులు ఇప్పుడు రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటున్నారు. ఇక, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం టీటీడీ కల్పిస్తోంది.
నడకదారిలో తగ్గిన భక్తులు: తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నారులపై చిరుతల దాడి కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్నాహ్నం 2 గంటల తరువాత నడకదారిలోకి అనమతించటం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. నడక మార్గంలో ప్రతీ రోజు 12 వేల నుంచి 24 వేల వరకు వెళ్లేవారు.

తాజాగా నడకమార్గంలో 8,200 మంది మాత్రమే వెళ్లారు. నడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు రక్షణగా నిలుస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కోనసాగిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు
వర్చ్యువల్ గా పాల్గొనే అవకాశం: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులు వర్చువల్‌గా పాల్గొనే అవకాశం టీటీడీ కల్పిస్తోంది.శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది .
రూ.500/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు టికెట్టు పొందిన తేదీ నుండి 90 రోజులలోపు గృహస్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వీరికి ఒక ఉత్తరియం, రవిక, లడ్డూ, వడ బహుమానంగా అందిస్తారు.

భద్రతా చర్యలు కొనసాగింపు: సుదూర ప్రాంతాల నుండి తిరుచానూరు వచ్చి అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన లేని భక్తుల కోసం టీటీడీ వర్చువల్ కల్యాణోత్సవం ప్రవేశపెట్టింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది. ఇక, భక్తులకు చేతి కర్ర ఇవ్వటంపై జరుగుతున్న ట్రోలింగ్ సరి కాదని ఛైర్మన్ భూమన అభిప్రాయ పడ్డారు.
భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషియల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications