తిరుమల ఘాట్ రోడ్డులో ఏం జరిగింది, ఎలక్ట్రిక్ బస్సుకు ఏమైయ్యింది ?, వైవీ సుబ్బారెడ్డి!

తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో కాలుష్యం పూర్తిగా నివారించడానికి టీటీడీ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో విద్యుత్ బస్సులు, వాహనాలు నడపడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ ను నిషేధించడానికి టీటీడీ అనేక చర్యలు తీసుకుంది.

తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి సంచరిస్తున్న విద్యుత్ బస్సు (ఎలక్ట్రిక్ బస్సు) తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురి కావడంతో శ్రీవారి భక్తులు హడలిపోయారు. ఇటీవల మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డుల మార్గంలో సంచరించడానికి ప్రవేశపెట్టారు.

TTD Chairman YV Subbareddy ordered an inquiry into the electric bus accident on Tirumala-Tirupati Ghat road.

బుధవారం మద్యాహ్నం తిరుమలలో 29 మంది శ్రీవారి భక్తులను ఎక్కించుకున్న ఎలక్ట్రిక్ బస్సు తిరుపతికి బయలుదేరింది. ఘాట్ రోడ్ మీదుగా తిరుపతికి వెలుతున్న బస్సు 28, 29వ మలుపు మధ్యలో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనింది. అంతే వేగంతో బ్యారీకేడ్లను ఢీకొట్టిన బస్సు లోయలోకి వెళ్లి ఓ చెట్టుకు ఢీకొని పట్టీకొట్టింది.

బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు 8 నుంచి 10 మీటర్ల లోయ ఉండటంతో ప్రయాణికులు హడలిపోయారు. అయితే దేవుడి దయవలన బస్సు అక్కడే పట్టికొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పి శ్రీవారి భక్తులకు గాయాలైనాయి, అదే సమయంలో అటువైపు వెలుతున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బస్సు దగ్గరకు వెళ్లి బస్సు ముందు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను రక్షించారు.

తిరుమల నుంచి తిరుపతి వెలుతున్న ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులను తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 8 మంది శ్రీవారి భక్తులకు గాయాలైనాయని అధికారులు తెలిపారు. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు.

డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు.తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డు లో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారితీసిన కారణాలు ఏమై ఉండొచ్చు అనే అంశాలపై టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి అధికారులతో చర్చించారు.

ఈ సందర్బంగా వైవీ. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. బస్సు లో సాంకేతిక ఇబ్బందులేమీ లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. అతి వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని, దీని పై విచారణ జరపాలని అధికారులను ఆదేశించామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయవల్ల బస్సులోని ప్రయాణీకులెవరికీ పెద్ద గాయాలు కాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంట టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం చెంగల్ రెడ్డి, ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+