Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అలిపిరి, మొట్ల మార్గంలో దర్శనం టోకెన్లు, వేసవిలో మూడు నెలలు!

తిరుమల/తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి వెల్లడించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్‌ వైవీ, సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. . తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ, బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు చాలా వరకు తగ్గిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి వివరించారు. ఈ మూడు నెలల పాటు వీఐపీ సిఫారసు లేఖలను తగ్గించాలని సంబంధిత వ్యక్తులకు తాము కోరడం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి మీడియాకు చెప్పారు.

సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందని, ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వివరించారు.

 TTD good news for srivari devotees, alipiri, darshan tokens on srivari steps

తిరుమలలో 7,500కు పైగా గదులు ఉన్నాయని, వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంటుందని, దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగిందని, ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి వివరించారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పీఏసీ2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని, అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతామని, మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి వివరించారు.

ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవిలో భక్తులకు ఎలాంటి కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకుంటున్నామని, టీటీడీ విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తామని టీటీడీ చైర్మన్ వైవీ, సుబ్బారెడ్డి వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి శ్రీవారి భక్తులకు అందిస్తున్న సేవల గురించి వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+