టీటీడీ గుడ్ న్యూస్.. దర్శనానికి అద్భుత అవకాశం
వేసవి సెలవుల దృష్ట్యా స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. రద్దీని తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలను రద్దు చేసినట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.
తిరుమలలోని క్యూలు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరం ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం అందించడంతోపాటు వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఆలయ మాడవీధుల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా షెడ్స్, కూలెంట్లు, కార్పెట్లు పరిచారు. ఉపశమనం కోసం ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి నారాయణగిరి గార్డెన్స్, ఆలయ పరిసరాల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ఆలయ మాడవీధుల్లో చలువ పందిళ్లు కూల్ పాయింట్లు వేశారు.

జూన్ 1 నుంచి 5 వరకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం, ఆకాశ గంగ దగ్గర ఉన్న బాలాంజనేయ స్వామి ఆలయం, ఏడో మైలు దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విద్యాసంస్థలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బెంగళూరుకు చెందిన ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి గోవింద కోటి రాసినందుకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.
ఈనెల 17 నుంచి 19 వరకు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు, 22న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి కార్యక్రమం, 21 నుంచి 23 వరకు తిరుచానూరులో వార్షిక వసంతోత్సవాలు, 22న స్వర్ణ రథం ఊరేగింపు జరగనున్నాయి. 23న కపిలేశ్వరస్వామి ఆలయంలో పత్ర పుష్పయాగం, 27 నుంచి 29 వరకు శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు, 23న తాళ్లపాక, తిరుపతిలో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications