భక్తులకు గుడ్ న్యూస్.. వీకెండ్స్‌లో సిఫారసు లేఖలు, బ్రేక్ దర్శనాలు రద్దు
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మర్ హాలీడేస్ తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
వారాంతాల్లో సిఫారసు లేఖలు, వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై డెసిషన్ తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. స్వామి వారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత కల్పించడానికి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో ఎక్కువమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు.

ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు హనుమన్ జయంతిని ఆకాశగంగ వద్ద వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
పేదల పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. ధర్మదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల కేటాయింపును పునరుద్ధరిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. తిరుమల శ్రీవారిని సామాన్యులు దర్శించుకునే వీలు కలుగుతుంది.












Click it and Unblock the Notifications